పార్టీ అధికారంలోకి వచ్చాక స్థానిక ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్‌తో సమన్వయం చేసుకుంటూ తన పట్టు ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కామవరపుకోట, టి.నరసాపురం, లింగపాలెం మండలాల్లో కరువు ప్రాంతాల్లో వ్యవసాయానికి గుండెకాయ లాంటి ఘంటా హనుమంతరావు ఎర్రకాలువ ఎత్తిపోతల పథకం పునరుద్ధరించి నీటిని వచ్చేలా చేయడంలో మురళీ ఎంతో కృషి చేశారు. గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవంతో పాటు ఇప్పుడు మంత్రిగా ఉన్న కొలుసు పార్థసారథి లాంటి నేతలు మురళీ సన్నిహితులు కావడంతో రాష్ట్ర స్థాయిలో ఎన్నో పనులు చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సారి ఏలూరు జిల్లా నుంచి నామినేటెడ్ రేసులో మురళీ ముందు వరుసలో ఉన్నారు. జిల్లాలో టీడీపీ తరపున రాజకీయాలు శాసించే బలమైన కమ్మ సామాజిక వర్గం ఈ సారి పార్టీ అధికారంలోకి వచ్చేందుకు చాలా త్యాగాలు చేసింది.
గతం నుంచి సంప్రదాయంగా తమ చేతుల్లో ఉన్న ఏలూరు ఎంపీ, ఉంగుటూరు అసెంబ్లీ సీట్లు వదులుకుంది. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లాలోని ఈ సామాజిక వర్గానికి ఈ సారి న్యాయం చేయాలన్న ఆలోచన చంద్రబాబుతో పాటు లోకేష్‌కు బలంగానే ఉంది. ఈ క్రమంలో కమ్మ వర్గానికే చెందిన మురళీకి ఈ సారి పదవి ఇవ్వాలన్నది అధిష్టానం ఆలోచన.. మురళీ పేరు చంద్రబాబు దృష్టిలోనూ ఉంది. కమ్మ కార్పొరేషన్ చైర్మన్ పదవి అధిష్టానం ప్రిపర్ చేసినా.. మురళీ ఆ పదవి తీసుకుంటే అందరికి న్యాయం చేయలేనన్న ఉద్దేశంతో సున్నితంగానే తిరస్కరించారని తెలిసింది. ఈ క్రమంలోనే తాను గత కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్వహించిన ఏపీఐడీసీ చైర్మన్ పదవి లేదా మరో రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి ఆశిస్తున్నారు. మురళీకి ఏదో ఒక పదవి ఇవ్వడం ఫిక్స్ అయినా.. ఏ పదవి దక్కుతుందన్నది మాత్రం అప్పటి వరకు సస్పెన్సే.. మురళీ అనుచరగణం మాత్రం.. తమ నేతకు రాష్ట్ర స్థాయి పదవి పక్కా అని ఫిక్స్ అయిపోయింది.