దీనికి తోడు తూర్పుగోదావరి జిల్లాలో రెండు కలిపి ఎంపి స్థానాలను కూటమి పార్టీలు దక్కించుకున్నాయి. రాజమండ్రి బిజెపి .. కాకినాడ జనసేన కైవసం చేసుకున్నాయి. ఈ రెండు పార్టీలతో యనమల దూరంగా ఉంటున్నారు. ఇటు సొంత పార్టీలోనూ ఆయన హవా దాదాపు తగ్గిపోయింది. తాజాగా కూటమి సర్కార్లు లోకేష్ అవా ఎక్కువగా కనిపిస్తోంది. లోకేష్ కు యనమలకు అంత సఖ్యత లేదని అంటున్నారు. కుమార్తె ఎమ్మెల్యే అయినా తానే చక్రం చెప్పాలని సహజంగానే యనమల భావిస్తున్నారు. ఒకప్పుడు జిల్లా మొత్తం ఆయన చెప్పినట్టు జరిగేది. ఇప్పుడు సొంత నియోజకవర్గంలోనే ఆయన మాటకు అంత వేల్యూ లేదన్న చర్చ నడుస్తోంది. దీనికి కారణం తునిలో జనసేన హవా కూడా ఎక్కువగా ఉంది. పైగా పక్కన పిఠాపురం నుంచి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాదినిత్యం వహిస్తున్నారు.
కాకినాడ ఎంపీ కూడా జనసేన ఖాతాలో ఉంది. కాకినాడ జిల్లాలో మెజార్టీ పదవులు జనసేనకు కేటాయించాల్సి వస్తోంది. పైగా అక్కడ ఉన్నతాధికారుల నియమకం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కను సన్నల్లోనే జరుగుతోంది. ఇవన్నీ యనమల మాట చెల్లుబాటు కాకుండా పోవడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇటు లోకేష్ దగ్గర కూడా యనమలకు గ్యాప్ ఉండడంతో యనమల మాట చిన్నచిన్న విషయాలలో కూడా చెల్లుబాటు కావడం లేదట. అందుకే ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితులలో యనమల రాజకీయాల నుంచి తప్పుకోవడమే బెటర్ అని అంటున్నారు.