- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .


ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏదైనా చెబితే అది నూటికి నూరు శాతం జరిగేలా పక్కాగా ప్లాన్ చేసుకుంటారు. ఎందుకో కానీ ఇటీవ‌ల కాలం లో ఆయన చెప్పిన వాటిలో కొన్ని మాత్రమే జరుగుతున్నాయి .. కొన్ని జరగటం లేదన్న చర్చలు ప్రభుత్వ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. కాకినాడ సీ  పోర్టులో అప్పట్లో విదేశీ షిప్పు విష‌యంలో సీజ్ షిఫ్ అని పవన్ ఆదేశించినా సీజ్ చేయలేకపోయారు. దీనిపై సోషల్ మీడియాలో గట్టి ప్రచారం జరిగింది. ఇక మరో కీల‌కాంశం రహదారుల బాగుచేత .. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రహదారుల ను ముఖ్యంగా పంచాయతీ స్థాయిలో బాగు చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో నే గ్రామీణ పంచాయతీ .. గిరిజన ప్రాంతాలకు చెందిన రహదారుల ను తిరిగి నిర్మించడం లేదా వాటికి మరమ్మతులు చేయటం అసలు రహదారులు లేనిచోట కొత్త వాటిని నిర్మించడం అనే కాన్సెప్ట్ పెట్టుకున్నారు.


దీనికి సంబంధించి సంక్రాంతి పండుగ టార్గెట్గా పెట్టుకుని సంక్రాంతి నాటికి అన్ని పనులు పూర్తి చేస్తామని పవన్ స్వయంగా ప్రకటించారు. అయితే పవన్ చేసిన రివ్యూలో పంచాయతీలో గిరిజన ఆవాసాలు ఉన్న ప్రాంతాలలో కేవలం 30% పనులు మాత్రమే పూర్తయ్యాయని తెలుస్తోంది. ఈ బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేల కు అప్పగించారు. దీంతో పనులు వేగంగా సాగుతాయని లెక్కలు వేసుకున్నారు. ఇప్పటివరకు పనులు ముందుకు సాగలేదు. కనీసం 50% కూడా చాలా చోట్ల పూర్తికాలేదు. దీనిపై పవన్ దృష్టిపెట్టారు. తాను భారీ స్థాయిలో నిధులు కేటాయించిన ఎందుకు పనులు కాలేదు ? అని తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. కనీసం 50% పనులు కానీ నియోజకవర్గాలలో ఉన్న ఎమ్మెల్యేలపై పవన్ తీవ్ర అసహనం అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు వాళ్లకు క్లాసు పీకుతున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: