వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాను రాజకీయాలకు దూరం కాబోతున్నారని తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు అదే పార్టీకి చెందిన మరో ఎంపీ కూడా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ఆ ఎంపీ ఎవరో ? కాదు ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి. ఆయన కూడా తన పదవితో పాటు వైసిపికి రాజీనామా చేస్తారంటూ శుక్రవారం గట్టిగా ప్రచారం జరిగింది. అయితే ఆయన రాజీనామా పై స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఆయన దావోస్ లో ఉన్నట్టు తెలిసింది. అక్కడ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన రాజీనామా పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వైసీపీ అధ్యక్షుడు జగన్ అక్రమస్తుల కేసులో అయోధ్య రామి రెడ్డి కూడా నిందితుడు. 2020లో ఆయనను జగన్ రాజ్యసభకు పంపారు. ఆయన పదవీకాలం వచ్చే ఏడాది వరకు ఉంది. ఎన్నికలలో వైసిపి ఘెర పరాభవం తర్వాత పార్టీ నుంచి ఇప్పటివరకు బయటకు వెళుతున్నారు.
ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసినప్పుడే అయోధ్య రామి రెడ్డి కూడా రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది. ఆయన బిజెపిలోకి వెళతారు అన్న చర్చలు అప్పట్లో వినిపించాయి. మరోవైపు అయోధ్య రామిరెడ్డి సోదరుడు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ( ఆర్కే ) ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసి షర్మిల వెంట ఉంటారంటూ కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత ఆయనను తిరిగి వైసిపి లోకి తీసుకువచ్చేందుకు జగన్ అయోధ్య రామిరెడ్డిని అస్త్రం గా ప్రయోగించారు. అయితే ఆర్కే వైసీపీలోకి వచ్చిన గత ఎన్నికలలో మంగళగిరిలో వైసిపి అభ్యర్థి లావణ్య గెలుపు కోసం అంతగా సహకరించలేదన్న ప్రచారం జరిగింది. ఎన్నికలలో వైసిపి గోర పరాజయం తర్వాత ఆయన కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో అయోధ్య రామిరెడ్డి రాజీనామా ప్రచారం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.