మాజీ క్రికెటర్ రాజకీయాల పట్ల ఎంతో ఆసక్తి ఉన్న అంబటి రాయుడు ఆంధ్రప్రదేశ్లో గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికలకు ముందు వైసీపీ కండువా కప్పుకున్నారు. అంబటి రాయుడు గుంటూరు నుంచి వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఏం జరిగిందో ఏమో కానీ వైసీపీ కండువా కప్పుకున్న వారం రోజులకే అంబటి రాయుడు వెళ్లి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఆ తర్వాత వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఇక తాజా సమాచారం ఏంటంటే అంబటి రాయుడు బిజెపి వైపు ముగ్గు చూపుతున్నారు అట. బిజెపి విద్యార్థి విభాగం అయిన ఏబీవీపీ 43 వ రాష్ట్ర స్థాయి మహాసభలు విశాఖపట్నంలో జరిగారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చిన అంబటి రాయుడు కాషాయం పార్టీకి అనుకూలంగా మాట్లాడారు. కొన్ని పార్టీల కుటుంబాల చుట్టూ తిరుగుతాయి .. మరికొన్ని పార్టీలు కార్పొరేట్ సంస్థల చుట్టూ తిరుగుతాయని .. దేశం కోసం పనిచేసే పార్టీ మాత్రం ఒకటి ఉందని అలా బిజెపి ప్రస్తావన తీసుకువచ్చారు.
అంబటి తన ఏడాది రాజకీయ అనుభవంతో ఇవన్నీ చూసి మాట్లాడుతున్నట్టు అంబటి తెలిపారు. అంబటి వైసిపి వైపు మొగ్గుచూపి ఆ తర్వాత జనసేనతో కనిపించి ఇప్పుడు బిజెపి వైపు చూస్తున్నారా ?అన్న చర్చలు సహజంగానే నడుస్తున్నాయి. అంబటి రాయుడు యువతతో పాటు విద్యార్థుల గురించి .. దేశభక్తి గురించి కూడా మాట్లాడారు. అలాగే ఆయన తన ఆలోచనలు కూడా పంచుకున్నారు. ఏది ఏమైనా అంబటి రాయుడుకు రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించాలని ఉంది. సరైన రాజకీయ వేదిక కోసం అన్వేషణ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన బిజెపి వైపు చూస్తున్నారా ? అన్న చర్చలు ఏపి రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి. ఎలాగూ ఏపీలో బిజెపికి బలమైన నాయకులు కావాలి .. కాస్త కూసో క్రికెటర్ గా మంచి చరిష్మా ఉన్న రాయుడు బిజెపిలోకి వస్తే అటు సామాజిక సమీకరణల పరంగా కూడా కలిసి వస్తుందని బిజెపి పెద్దలు లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది.