కొన్ని బంధాలు గట్టిగానే ఉంటాయి.  తెలుగు రాజకీయాల్లో ఒక పార్టీ నుంచి వేరొక పార్టీలోకి వెళ్ళిన వారు తమ మాతృ సంస్థ పై ప్రేమ చూపించడం మనకు పలు సందర్భాల్లో కనిపించింది.  అయితే ఒకే కుటుంబంతో అవినాభావ బంధం పెనవేసుకున్న విజయసాయిరెడ్డి జగన్ తో అంత సులువుగా బంధం తెంచుకోగలరా అన్న చర్చ నడుస్తోంది.  


ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటాను ప్రకటించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ కు గురయ్యారు. ఆయన దగ్గర నుంచి ఇలాంటి ఇక ప్రకటన వస్తుందని ఎవరూ ఊహించలేదు.  మరో వైపు చూస్తే వైసీపీ అధినాయకత్వం నుంచి కూడా ఎవరూ ఈ విషయంలో స్పందించకపోవడం, జగన్ రియాక్షన్ ఏంటి అని మీడియా ప్రశ్నించినప్పుడు వద్దు అన్నారని తాము అండగా ఉంటామని బదులిచ్చారని చెప్పారు.


అయితే విజయసాయి రెడ్డి రాజకీయాలకు మాత్రమే గుడ్ బై చెప్పారు అని భావించాలి. అంతేకానీ వైసీపీకి చేటు తెస్తారని జగన్ తో రాజకీయ వైరం పెట్టుకుంటారు అని ఎవరూ అనుకోవడం లేదు.  ఇక విజయసాయిరెడ్డి సైతం జగన్ కి మంచి జరగాలని కూడా కోరుకున్నారు.  వైసీపీకి జగన్ కి ఆయన దూరం జరిగినా అది భౌతికంగా మాత్రమే తప్ప వేరొకటి కాదని కూడా వైసీపీ క్యాడర్ సమాధానం పడుతున్నారు.  


విజయసాయిరెడ్డి ఎప్పటికీ వైసీపీ వారే అని వారు సొంతం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ నుంచి విజయసాయిరెడ్డిని బీజేపీలోకి పంపాలని ఆ పార్టీ అధినాయకత్వం ప్లాన్ వేసి ఇలా చేసింది అన్న వార్తల పట్ల కూడా ఎవరూ నమ్మడం లేదు.


జగన్ విషయం తీసుకుంటే ఆయన ఇలాంటి వ్యూహాలు వేస్తారని కూడా అనుకోవడం లేదు అంటున్నారు.  అదే సమయంలో ఆయన ఏది చేసినా డైరెక్ట్ గానే చేస్తారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  ఇక విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం ద్వారా ఫ్రీ బర్డ్ అయ్యారని అంటున్నారు.   ఆయన ఏమి చేసినా జగన్ కి ఎదురు నిలిచే రాజకీయం చేస్తారని మాత్రం వైసీపీ శ్రేణులు అనుకోవడం లేదు.  మరి ఆయన మీద అంత నమ్మకం వైసీపీలో వ్యక్తం అవుతోంది.  మొత్తానికి చూస్తే జగన్ విజయసాయిరెడ్డిల మధ్య బంధం బలీయమైనది అని అంతా అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: