దావోస్ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చారు. మూడు రోజుల్లోనే 1.32 లక్షల కోట్ల ఒప్పందాలను కుదుర్చుకున్నారు. దాదాపు 10 సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ఒప్పుకున్నాయి. ఒక్కరోజే దాదాపు 60 వేల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఒప్పందాలు పెట్టుబడులు వచ్చినా ఈ రేంజ్ లో ఎప్పుడు జరగలేదని విశ్లేషకులు అంటున్నారు.
సన్ పెట్రో కెమికల్స్ సంస్థ 45 వేల కోట్లను పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది.. ఇన్ఫోసిస్, అమెజాన్ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలకు కుదుర్చుకున్నాయి. ఇన్ఫోసిస్ కంపెనీ ఒప్పందంలో భాగంగా పోచారం ఐటీ క్యాంపస్ ను విస్తరించనుంది. మరో వైపు ఆమెజాన్ కూడా 60 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది. డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు రాగా.. దీనికి రేవంత ప్రభుత్వం ఓకే చెప్పింది.. గత ఏడాది దావోస్ కు మించి పెట్టుబడులు సాధించాలని భావించింది. అదే స్థాయిలో పెట్టుబడులు కూడా సాధించారని చెప్పవచ్చు. ఇప్పటివరకు 1.32 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను వివిధ కంపెనీల నుంచి ఆకర్షించింది. సుమారు 46 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. పరోక్షంగా ఇంతకుమించి ఉపాధి లభించే అవకాశం ఉంది.
పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్న కంపెనీలు ఇవే సన్ పెట్రో కెమికల్స్ 45వేల కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. 7000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. మేఘా కంపెనీ 15000 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. 4250 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. కంట్రోల్ ఎస్ అనే కంపెనీ పదివేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ పెట్టుబడుల ద్వారా 3600 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
JSW కంపెనీ 800 కోట్ల పెట్టుబడితో ముందుకు వచ్చింది. ఈ కంపెనీ 200 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. స్కై రూట్ కంపెనీ 500 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. హెచ్ సి ఎల్, విప్రో కంపెనీలు పెట్టుబడులు పెట్టడం ద్వారా పదివేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. యూనిలీవర్ కంపెనీ రెండు మ్యానుఫ్యాక్చర్ యూనిట్లు నెలకొల్పనుంది.