ఉన్నట్లుండి వైసీపీలో నంబర్ టూగా ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్ వి విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అది కూడా మూడున్నరేళ్ల పదవీకాలం ఉండగా ఆయన ఈ పని చేయడం పట్ల పలువురికి షాక్ ఇచ్చినట్లేయింది. పెద్దల సభలో కీలకమైన పదవిని రాజీయామా చేయడం అంటే మామూలు విషయం కాదు. అసలు దీని వెనుక ఏం జరిగిందని అందరూ తీవ్రంగా ఆలోచన చేస్తున్నారు.
ఎవరికీ వారు తమకు నచ్చిన విశ్లేషణలు చేస్తున్నారు. వేరే పార్టీలోకి మారుతున్నారంటూ.. విదేశాలకు వెళ్లిపోతున్నారంటూ.. ఛానల్ పెడుతున్నారంటూ రకరకాల ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఇక ఏది ఏలా ఉన్నా ఇప్పుడు ఖాళీ అవుతున్న రాజ్యసభ సీటు మాత్రం కూటమి ప్రభుత్వం ఖాతాలోకే పోనుంది. పైగా ఈ సీటు కూడా బీజేపీ ఖాతాలో పడబోతోంది అని ప్రచారం జరుగుతోంది.
అంటే బీజేపీ వైసీపీని టార్గెట్ చేసింది అని అర్ధం అవుతోంది. బీజేపీకి రాజ్యసభలో బలం కావాలి. కీలకమైన బిల్లులు అక్కడ ఆమోదం పొందాలి. బడ్జెట్ సెషన్ ఫిబ్రవరి 1 నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. ఈసారి జమిలి ఎన్నికల బిల్లుతో పాటుగా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు వంటివి కీలకమైన వాటిని బీజేపీ ఆమోదించుకోవాల్సి ఉంది. దాంతో పాటు రాజ్యసభలో మరింతగా బలపడాలని చూస్తోంది. దాంతోనే వైసీపీకి అక్కడ ఉన్న ఎంపీల మీద ఫోకస్ పెట్టారు అని అంటున్నారు .
ఏపీలో ఉన్న ప్రాంతీయ పార్టీల రాజకీయాలు వారి అనివార్యతలు పరిమితుల మధ్యలో జాతీయ పార్టీ అయిన బీజేపీ బలపడాలని చూస్తోంది అని అంటున్నారు. వైసీపీ రాజకీయంగా ఇబ్బంది పడితే ఆ మేరకు టీడీపీ లాభపడాలి. కానీ ఇక్కడ బీజేపీ బలపడాలని చూస్తోంది. దాంతో విజయసాయిరెడ్డి ఏపీసోడ్ లో టీడీపీకి రాజకీయంగా అనుకూలతను ఇవ్వదని పైగా సమీప భవిష్యత్తులో బీజేపీ ఏపీలో తన రాజకీయ పట్టు గట్టిగా బిగిస్తే ఆ మేరకు టీడీపీకి కూడా ఇబ్బంది అవుతుందని విశ్లేషణలు ఉన్నాయి. మొత్తం మీద వైసీపీ ఖాళీ అయినా ఆ మేర ప్రయోజనం టీడీపీకి ఉండటం లేదన్న విశ్లేషణలు జోరుగా వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.