అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తన నిర్ణయాలతో శత్రు దేశాల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు. ఆయన తన చేష్టలతో కొన్ని సమస్యలను సులభంగా పరిష్కరిస్తుండగా మరికొన్ని అమెరికాకు సైతం చేటు తెస్తున్నాయి. తాజాగా ఆయన చేసిన ఒకే ఒక్క సంతకం.. ఎన్నో జీవితాలను తలకిందులు చేస్తోంది. ఇతర దేశాలను భయపెడుతోంది..
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎంతటి మోనార్కో అందరికీ తెలిసిందే. ఆయనకు చెప్పగలిగేవారు ఈ భూమ్మీద ఎవరూ లేరు. కాస్తో కూస్తో ఆయన మాత్రం మన ప్రధాని మోదీ మాట వింటుంటారు. తాజాగా ఆయన ట్రంప్ మాట కూడా వినేందుకు సిద్ధమయ్యారు. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతానని ట్రంప్ పలుసార్లు ఎన్నికల ప్రచార సభల్లో చెబుతూ వచ్చారు. యుద్ధం అనేది అసలు మొదలే కాకూడదని.. తాను అధ్యక్షుడిగా ఉంటే ఉక్రెయిన్ సంక్షోభం వచ్చేది కాదన్నారు. త్వరలోనే దీనికి ముగింపు పలుకుతానని హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ తో శాంతి ఒప్పందంపై చర్చలకు రాకుంటే రష్యాపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు.
అయితే ఆయన తాజాగా వందలాది కార్యనిర్వాహక ఆర్డర్ల (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్)పై సంతకాలు చేశారు. అందులో ఒక్కటి మాత్రం ఉక్రెయిన్ ను చాలా కలవరపెడుతోంది. అదే యుద్ధ సాయం నిలిపివేత. ట్రంప్ విడుదల చేసిన ఆర్డర్లలో విదేశాలకు అందించే అన్ని రకాల సాయాలను 90 రోజులపాటు నిలిపివేయడం ఒకటి. రష్యాతో శక్తికి మించి పోరాడుతున్న ఉక్రెయిన్ కు సైనిక అవసరాల్లో 40 శాతం అమెరికానే అందిస్తోంది. 725 మిలియన్ డాలర్ల ప్యాకేజీ, 988 మిలియన్ డాలర్ల సామగ్రి సాయానికి బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉక్రెయిన్ కు హామీ ఇచ్చారు. ఇందులో 62 బిలియన్ డాలర్లు ఆయుధాలు, ఇతర సాయం అందించారు. మరో 500 మిలియన్ డాలర్ల ఆయుధ సాయం అందిస్తామని గతంలో ప్రకటించారు. వీటిని ట్రంప్ ఆది నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. తాజాగా వీటికి చెక్ పెడుతూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.
తాగాజా అమెరికా తమకు సైనిక సాయం ఆపలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. కష్ట సమయంలో తమకు సాయం ఆపకుండా నిర్ణయం తీసుకున్నందుకు అమెరికాకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలైంది. అంటే సరిగ్గా ఈ ఫిబ్రవరి 24కు మూడేళ్లవుతుంది. అప్పటికి ఏం జరుగుతుందో చూడాలి.