- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )


వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి ఇటీవ‌ల రాజీనామా చేసిన వేణుంబాకం విజ‌య‌సా యిరెడ్డి వ్య‌వ‌హారం గ‌త రెండు రోజులుగా రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌కంగా మారింది. దేశ జాతీయ రాజ‌కీయా ల్లో సాయిరెడ్డి వైసీపీని ముందుండి న‌డిపించార‌న‌డంలో సందేహం లేదు. ఇటు రాష్ట్ర బాధ్య‌త‌లు, అటు జాతీయ రాజ‌కీయాల్లోనూ ఆయ‌న రాణించారు. అలాంటి నాయ‌కుడు హ‌ఠాత్తుగా రాజీనామా చేయ‌డం.. వైసీపీకి కూడా రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌డం వ్య‌వ‌సాయం వైపు మొగ్గు చూప‌డం వంటివి యాదృచ్ఛి క‌మేనా? అనేది ప్ర‌శ్న‌.


ఎక్క‌డో ఆడిట‌ర్‌గా ప‌నిచేసుకునే సాయిరెడ్డిని రాజ‌కీయాల బాట ప‌ట్టించిన ఘ‌న‌త ఖ‌చ్చితంగా జ‌గ‌న్‌కే ద‌క్కుతుంది. అప్ప‌టి వ‌ర‌కు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి, రాజారెడ్డిల ద‌గ్గ‌ర కూడా.. ఆడిట‌ర్‌గా ప‌నిచేసిన‌ప్ప‌టికీ వారు ఎప్పుడు సాయిరెడ్డిలో ఉన్న నాయ‌కుడిని చూడ‌లేదు. ఇది జ‌గ‌న్‌కు మాత్ర‌మే సాధ్య‌మైంది. ఈ క్ర‌మంలోనే రాజ్య‌స‌భ‌కు పంపించారు. ఒక‌సారి కాదు రెండుసార్లు ఆయ‌న‌ను స‌భ‌కు పంపించి ప్రోత్స‌హిం చారు. అంతేకాదు.. పార్టీలోనూ కీల‌క రోల్ అప్ప‌గించారు. దీంతో జ‌గ‌న్‌-సాయిరెడ్డి అంటే స‌యామీ క‌వ‌ల‌లు అనుకునే స్థాయికి చేరారు.


అలాంటి సాయిరెడ్డి రాజీనామా చేయ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది. మ‌రి ఇది ఆయ‌న చెప్పి న‌ట్టు ఊరికేనా జ‌రిగిందా?  అస‌లు రాజ‌కీయాల్లో నిజాయితీ కోరుకుంటున్నాన‌ని సాయిరెడ్డి చెప్ప‌డం స‌రై న రీజ‌నేనా? అంటే కాద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. సాయిరెడ్డి రాజీనామా వెనుక అనేక పార్శ్వాలు ఉన్నాయ‌న్న‌ది ప‌రిశీల‌కుల అంచ‌నా. తెర‌వెనుక కేంద్రంలోని పెద్ద‌ల హ‌స్తం ఉంద‌ని కూడా తెలుస్తోంది. రాజ‌కీయంగా త‌న‌ను తాను ఎద‌గాల‌ని చూసుకునే కీల‌క జాతీయ పార్టీ ఇలాంటి విష‌యాల్లో చాలా జాగ్ర‌త్త‌గా పావులు క‌దుపుతుంది.


ఇదే సాయిరెడ్డి విష‌యంలోనూ జ‌రిగింద‌న్న చ‌ర్చ సాగుతోంది. సాయిరెడ్డిపై ఇప్పుడు ప‌లు కేసులు ఉన్నా యి. రాజకీయంగా కూడా ఆయ‌న కోరుకున్న ఎలివేష‌న్ పార్టీలో ల‌భించ‌డం లేదు. ముఖ్యంగా డిప్యూటీ స్పీక‌ర్ వంటి ప‌ద‌వి గ‌తంలో ఎదురేగి వ‌చ్చిన‌ప్పుడు.. అధినేత ఆదేశాల‌తో సాయిరెడ్డి వెనక్కి త‌గ్గాల్సి వ‌చ్చింది. అంతేకాదు.. పార్టీలో నెంబ‌ర్ 2 స్థానం నుంచి కింద‌కు తోసేసిన వైనం కూడా ఆయ‌న‌ను బాధించింద‌నే చెప్పాలి.


ఇక‌,వైసీపీ పార్ల‌మెంటరీ పార్టీ నాయ‌కుడిగా తాను తీసుకునే నిర్ణ‌యాల‌కు.. రాష్ట్ర స్థాయి నాయ‌కుల నిర్ణ‌యాల‌కు మ‌ధ్య ఎదురైన అనుభ‌వాలు వంటివి కూడా సాయిరెడ్డిని క‌దిలించాయ‌న్న‌ది జాతీయ మీడియా చెబుతున్న మాట‌. వెర‌సి.. ఊర‌క‌రారు.. అన్న‌ట్టుగానే సాయిరెడ్డి ఊరికేనే రాజీనామా చేయ‌లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: