పశ్చిమ బెంగాల్ లో మూడు సార్లు గెలిచి తిరుగులేని రాజకీయ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ తాజాగా 2024 సార్వత్రిక ఎన్నికల మీద తనదైన విశ్లేషణ చేస్తూ మూడు పుస్తకాలను ఆవిష్కరించారు.  ఈ పుస్తకాలలో ఆమె నేరుగా కాంగ్రెస్ నే టార్గెట్ చేశారు. మోదీ విజయాల వెనక కాంగ్రెస్ ఉందని సంచలన ఆరోపణలే చేశారు.  ఇండియా కూటమి సమర్ధంగా ఐక్యంగా 2024 ఎన్నికల్లో ఎన్డీయేని ఎదుర్కోలేకపోయిందని అన్నారు.


కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల వల్లే ఇండియా కూటమి ఓడి నరేంద్ర మోదీ అధికారంలోకి రాగలిగారు అని ఆమె ఆక్షేపించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి పార్టీలు అన్నీ కలిసినా ప్రయోజనం లేకపోయిందని ఒకరి మీద ఒకరు పోటీ చేసి బీజేపీకి ఎంతో మేలు చేశారని విమర్శించారు.  ఈ రకమైన చర్యలు అన్నీ బీజేపీకి ఎంతో బాగా కలసి వచ్చాయని అభిప్రాయపడ్డారు.   ఇండియా కూటమికి కనీస ఉమ్మడి కార్యక్రమం అమలు చేసే పరిస్థితి కానీ ఉమ్మడి మేనిఫేస్టోని కార్యరూపం దాల్చేలా చేసే ప్రయత్నం కానీ లేదని ఏకి పారేశారు.  


ఇలా బీజేపీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ అతి ముఖ్య పాత్ర పోషించింది అని ఆమె ఆరోపించారు.  మమతా బెనర్జీ చాలా కాలంగా కాంగ్రెస్ మీద తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.  కూటమిలోని ఇతర పార్టీలను గౌరవించడం లేదని ఆమె అంటున్నారు. ఇండియా కూటమిని సారధ్యం వహించాలని మమతా బెనర్జీకి ఉందని అంటున్నారు.  బీజేపీని కట్టడి చేయాలీ అంటే దూకుడు రాజకీయం అవసరమని ఆమె భావిస్తున్నారు.  


కాంగ్రెస్ కూడా ఇండియా కూటమిలోని ఇతర పార్టీలను గౌరవిస్తూ వారి రాజకీయ అవకాశాలను పెంచేలా చూడాలని అవసరమైన చోట తాను ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలని కూడామమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ వంటి వారు సూచిస్తున్నారు.  దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆప్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ బరిలోకి దిగడాన్ని మమతా బెనర్జీతో సహా ఇండియా కూటమి పార్టీలు అన్నీ తప్పు పడుతున్నాయి.  ఈ క్రమంలో కాంగ్రెస్ ని ఒంటరిని చేసి ఇండియా కూటమి పార్టీలు ఆప్ కే మద్దతుని ప్రకటించాయి.  తాజాగా బీజేపీని కాంగ్రెస్ గెలిపిస్తోంది అనిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ చేసిన ఆరోపణల ఎక్కడకి వెళ్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: