- ఇండియాలో మొదటి బడ్జెట్ స్వాతంత్య్రం రాకముందు.. ఏప్రిల్ 7, 1860లో బ్రిటీష్ పాలనలో.. జేమ్స్ విల్సన్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున సమర్పించారు.
- స్వాతంత్య్రం వచ్చాక మొదటి బడ్జెట్ నవంబర్ 26, 1947వ సంవత్సరంలో తొలిసారిగా ఆర్థిక మంత్రి ఆర్ కె షణ్ముకం చెట్టి బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
- మాజీ ప్రధాన మంత్రి మోరార్జీ దేశాయ్.. ఇండియాలో ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టి రికార్డులకు ఎక్కారు. ఆయన ఆర్థిక మంత్రి గా అంటే 1962 నుంచి 1969 వరకు మొత్తం పదిసార్లు బడ్జెట్ ప్రవేశెట్టారు.
ఆ తర్వాత ప్లేసులో పి. చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు, యశ్వంత్ సిన్హా 8 సార్లు, మన్మోహన్ సింగ్ 6 సార్లు ఆర్థిక మంత్రులుగా బడ్జెట్ సమర్పించారు.
- ఇక ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2025 తన 8వ బడ్జెట్ను సమర్పిస్తారు. నిర్మల
ప్రణబ్ ముఖర్జీ, యశ్వంత్ సిన్హా తర్వాత స్థానంలో ఉన్నారు.
- ఇక నిర్మలా సీతారామన్ 2020-21 బడ్జెట్ సమావేశంలో 2 గంటల 42 నిమిషాలు బడ్జెట్ ప్రజెంట్ చేశారు. ఇదే అన్ని బడ్జెట్ సమావేశాల్లో అతి పెద్ద స్పీచ్. జూలై 2019లో 2 గంటల 17 నిమిషాలు మాట్లాడిన.. ఆమె రికార్డును.. 2020లో ఆమెనే బ్రేక్ చేసుకున్నారు.
- బడ్జెట్ని ప్రవేశ పెట్టిన రెండో మహిళ నిర్మలా సీతారామన్. మరి మొదటి మహిళ ఇందిరా గాంధీ. ఆమె 1970-71 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ సమర్పించారు.
- మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ 1991లో నరసింహ రావు హయాంలో 18,650 పదాలు ఉపయోగించి.. స్పీచ్ ఇచ్చారు.
- 1977లో హిరుభాయి పటేల్ 800 పదాలతో అతి చిన్న స్పీచ్ ఇచ్చారు.
- ఇక రైల్వే బడ్జెట్ విషయానికి వస్తే 2017 వరకు రైల్వే బడ్జెట్, కేంద్ర బడ్జెట్ను విడిగానే ప్రవేశపెట్టేవారు. 2017లో రెండిటీని కలిపి ప్రవేశ పెట్టారు.
- బ్రీఫ్కేస్ బడ్జెట్కి, పేపర్లేని బడ్జెట్కి చెక్ పెట్టిన నిర్మల 2023లో పేపర్లేని బడ్జెట్ని ప్రవేశ పెట్టారు.