తెలంగాణ బిజెపిలో అంతరుధ్యం ఒక రేంజ్ లో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. నేడు రేపో పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారణగా ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న కామెంట్లు రాజకీయ వర్గాలలో కలకలం రేపుతున్నాయి. కాబోయే కొత్త అధ్యక్షుడిని ఉద్దేశించే బండి ఈ డైలాగులు చేస్తున్నారా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ బిజెపిలో చాలా రోజులుగా కోల్డ్ వార్ నడుస్తోంది. మరి ముఖ్యంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ దూకుడు మీద ఉండటం ఆయన వ్యతిరేక వర్గానికి రుచించడం లేదట. మూడు ఏళ్ల క్రితం బిఆర్ఎస్ నుంచి బిజెపికి వచ్చిన ఈటెల రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. అయితే ఆర్ఎస్ఎస్ బ్యాగ్రౌండ్ ఉన్న వారికి పార్టీ పగ్గాలు అప్పగించాలని ఓవర్గం డిమాండ్ చేస్తోంది.
ఈ క్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కామెంట్లు కాక రేపుతున్నాయి. పద్మ అవార్డుల సందర్భంగా గద్దర్ పై బండి చేసిన కామెంట్లు కలకలం రేపాయి. కమ్యూనిస్టు నేపథ్యం ఉన్నవారికి అవార్డులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీంతో ఆయన పరోక్షంగా ఈటలకు పదవి పైన ప్రశించినట్లయింది. బీఆర్ఎస్లో చేరకముందు ఈటలకు కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు ఉండేవి. అందుకే బండి ఇలా మాట్లాడారని అంటున్నారు. ఈటల ప్రయత్నాలకు బీజేపీలో కొందరు అడ్డుగా నిలుస్తువస్తున్నారు. బండి సంజయ్ గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణ లో ఆ పార్టీకి మంచి ఊపు తెచ్చారు. ఈటల బీజేపీ లోకి వచ్చాక కథ మారుతోంది. ఈటల బీసీ నేత .. ఆయన హవా పెరుగుతుండడంతో ఈటలకు ఎర్త్ పెట్టేలా కేంద్ర మంత్రి సంజయ్ పరోక్ష విమర్శలు గుప్పిస్తున్నారన్న పుకార్లు ఉన్నాయి. ఈటల స్థానంలో తెలంగాణకు చెందిన ఆర్ఎస్ఎస్ తో బలమైన బంధం ఉన్న ఓ తెలంగాణ నేత తన అనుచరుడికి బీజేపీ అధ్యక్ష పదవి ఇప్పించుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.