మనం తరచూ రాష్ట్ర అప్పుల గురించి మాట్లాడుతూ ఉంటాం. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అపుల పాలు చేసిందని.. దివాళా తీయించిందని.. ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేద్దామంటే చేతిలో చిల్లిగవ్వం లేదని ఏపీ తెలంగాణ సీఎంలు వ్యాఖ్యానించడం మనం నిత్యం చూస్తుందే.  అయితే రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే అప్పులు తప్ప మరోక ఆప్షన్ లేదని చెబుతూ ఉంటారు.  


అయితే ఇప్పుడు భారతదేశం అప్పుల గురించి ప్రస్తావన వచ్చింది.  మోదీ హయాంలో వివిధ రంగాల్లో దేశాన్ని బలోపేతం చేసినట్లు కమలనాథులు చెబుతున్నారు. దీనిని పక్కప పెడితే పదేళ్ల పాలనలో దేశ అప్పు భారీగా పెరిగిపోవటం ఆందోళనకు గురి చేసేదిగా చెప్పాలి.


తాజా బడ్జెట్ లో దేశ అప్పు వివరాల్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2026 మార్చి 31 (వచ్చే ఏడాది) నాటికి 196,78,772.62 కోట్లుగా పేర్కొన్నారు.  సింఫుల్గా చెప్పాలంటే రూ.196 లక్షల కోట్లుగా చెప్పాలి. ఈ మొత్తం అప్పులో రూ.190 లక్షల కోట్లు  దేశీయ అప్పు కాగా.. 6.6లక్షల కోట్లు విదేశీ రుణంగా చెప్పాలి.


ఈ ఏడాది మార్చి 31 నాటికి మాత్రం రూ.181 ల కోట్లకు చేరనుంది. పదేళ్ల క్రితం.. అంటే మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టటానికి ముందు దేశ అప్పు రూ.62వేల లక్షలకోట్లు మాత్రమే ఉండేది. మరింత సరైన అంకెల్ని చెప్పాలంటే 2015 మార్చి 31 నాటికి రూ.62,22,357.55 కోట్లుగా ఉండేది. పదేళ్ల వ్యవధిలో ఇంత భారీగా అప్పుల బారిన పడటం దేనికి సంకేతం?  అన్నది ప్రశ్న.  ఈ పదేళ్లలో అప్పు భారం 192 శాతానికి పెరిగింది.


నిర్మలా సీతారామన్ మాత్రం కేంద్ర ప్రభుత్వ అప్పు ఏటా తగ్గుముఖం పడుతుందని చెప్పారు. జీడీపీలో రుణ నిష్పత్తి తగ్గుతూ పోతోందని చెప్పిన ఆమె.. ఈ ఏడాది ఆర్థిక లోటు 4.8 శాతానికి తగ్గిందని..  వచ్చే ఏడాదికి 4.4 శాతానికి తగ్గించాలన్న లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: