మెక్సికో, కెనడా, చైనాలపై సుంకాల విధింపు అయిపోయింది. జన్మతః అమెరికా పౌరసత్వం రద్దయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగడం కూడా పూర్తైంది. ఇక అమెరికా అధ్యక్షుడు డానాల్డ్ ట్రంప్ చేతిలో మిగిలి ఉన్న పని పనామా కాల్వ.. ఈ మేరకు ఆయన కార్యరంగంలోకి దిగారు. అంతేకాదు… పనామాకా కాల్వను చైనా పరోక్షంఆ నిర్వహిస్తోందని ఆరోపించారు.  అందుకే కాల్వను తిరిగి తీసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు.


మొత్తం మీద చైనాకి మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.  పనామా కెనాల్ అంశాన్ని ప్రస్తావిస్తూ…”చూస్తూ ఉండండి.ఎవరూ ఊహించనిదేదో త్వరలోనే జరుగుతుంది” అని స్టేట్‌మెంట్ ఇచ్చారు ట్రంప్. మామూలుగానే షాక్‌లు ఇచ్చే ట్రంప్..ఈ సారి వార్నింగ్ ఇచ్చి మరీ చైనాని గట్టిదెబ్బ కొట్టేలా ఉన్నారు.  అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాలను కలిపే అత్యంత కీలకమైన పనామా కెనాల్‌పై చైనా ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇది అమెరికాకు అసలు నచ్చడం లేదు.


ఒప్పందాలను ఉల్లంఘించి మరీ చైనా ఆధిపత్యం చెలాయిస్తోందని మండిపడుతున్నారు. అంతే కాదు. అసలు ఈ పనామా కెనాల్‌ని నిర్మించిందే అమెరికా అని తేల్చి చెప్పారు. ఈ పనామా కెనాల్‌ని వండర్ ఆఫ్ ది వరల్డ్‌గా అభివర్ణిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్.  1914లో అమెరికా ఈ కెనాల్‌ని నిర్మించిందని స్పష్టం చేశారు.  నిజానికి ఈ కెనాల్‌పై అమెరికాదే పైచేయి అని అంటున్నారు ట్రంప్.


ఈ కెనాల్ విషయంలో ఒప్పందాలను పనామా ఉల్లంఘించిందని ఆరోపిస్తున్నారు. “ఇప్పుడు పనామా కెనాల్‌పై పరోక్షంగా చైనాయే ఆధిపత్యం చెలాయిస్తోంది. అసలు ఈ కాలువను చైనాకి ఎవరూ ఇవ్వలేదు. కానీ నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. కచ్చితంగా మీరెవరూ ఊహించనిదేదో త్వరలోనే జరగబోతుంది. ఆ కెనాల్‌ని పూర్తిగా మేమే స్వాధీనం చేసుకుంటాం” అని వెల్లడించారు ట్రంప్.  



పనామా కెనాల్‌ అమెరికాకి విలువైన సంపద అని, దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. అమెరికా పరంగా చూస్తే దాదాపు 40% మేర కంటెయినర్‌లు ఈ కెనాల్ నుంచే వెళ్తాయి.  కేవలం ఆర్థిక పరంగానే కాదు. చైనా ఆధిపత్య ధోరణిని అడ్డుకునేందుకు కూడా అమెరికా ఇలా పనామా కెనాల్‌పై పట్టుదలగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: