కర్ణాటకలో ప్రభావంతో కాంగ్రెస్ తెలంగాణాలోనూ జెండా ఎగరేసింది.   కర్ణాటక కాంగ్రెస్ అధినాయకత్వం సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి చేసింది.  అప్పటి కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ గా డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి కోసం చివరి దాకా పోటీ పడ్డారు. అయితే అధికారం చెరి సగం అనే ఒప్పందం అప్పుడు ప్రచారం తెరపైకి వచ్చింది.  శివకుమార్ కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి కీలక శాఖలతో సమానమైన ప్రాధాన్యతను కల్పించారు.   


అయితే సిద్ధరామయ్య పదవీ కాలం ఈ నవంబర్ నాటికి రెండున్నరేళ్ళు పూర్తి అవుతాయి.  దాంతో ఆ పదవిని డీకే శివకుమార్ కి ఇస్తారు అని ఆయన వర్గీయుల ప్రచారం జోరందుకుంది.  ఈ క్రమంలో కర్ణాటకలో విందు రాజకీయాలు జోరుగా సాగాయి.  దీనిపై అధిష్ఠానం సీరియస్ కూడా అయింది.  ఈ క్రమంలో సిద్ధరామయ్య అనుకూల వర్గం నేతలు డీకే శివకుమార్ తమ శాఖల్లో జోక్యం చేసుకుంటున్నారు అని వారు ఆరోపిస్తున్నారు.


ఈ క్రమంలో మరోవైపు కొందరు నాయకులు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ సమితి అధ్యక్ష స్థానంపై కన్నేశారు. సిద్ధరామయ్యను సీఎంగా బాధ్యతల నుంచి తప్పించి డీకే శివకుమార్ కి  పాలన పగ్గాలు అందిస్తారని విపక్ష నేత అశోక్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి.  కర్ణాటకలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్ కృషి చేశారని ఎమ్మెల్యే హెచ్సీ బాలకృష్ణ తెలిపారు. 


మరోవైపు పీసీసీ చీఫ్ ఉప ముఖ్యమంత్రి ఒక్కరే సరిగ్గా నిర్వహించలేరని అందువల్ల ఆ పదవిని ఆయనకు కాకుండా వేరే వారికి ఇవ్వాలని మంత్రులు రావణ్ణ, సతీశ్‌ జార్కహోళీ, డాక్టర్ పరమేశ్వర్ ఇప్పటికే ప్రత్యక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ అధిష్ఠానంపై ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.  అయితే రాష్ట్ర రాజకీయ వ్యవహారాలను వివాదం చేయవద్దని ఖర్గే సూచించినా వివాదం మాత్రం నివురగప్పిన నిప్పులా కొనసాగుతూనే ఉంది. 


మరోవైపు వరసబెట్టి డీకే వ్యతిరేకులు జరుపుతున్న విందు రాజకీయాలకు సిద్ధరామయ్య మద్దతు ఉందని డీకే వర్గీయులు అనుమానిస్తున్నారు. మొత్తం మీద చూస్తే కాంగ్రెస్ లో సీఎం కుర్చీలాట మొదలైంది అని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: