కరోనా సమయంలో ఎనలేని సేవలు అందించిన మనిషి ఎవరు అని అడిగితే మన అందరికీ గుర్తుకొచ్చే పేరు సోను సూద్.  రాష్ట్రాలతో సంబంధం లేకుండా, ఆపదలో ఉన్న ప్రతీ ఒక్కరికి పిలిస్తే పలుకుతాను అనే స్థాయిలో ఆయన సేవ కార్యక్రమాలు చేశారు. సినిమాల్లో విలన్ గా నటించే సోను సూద్, ఇలాంటి మహోన్నతమైన పనులు చేసి నిజ జీవితంలో హీరో గా నిలిచాడు.  



ఇదంతా ఆయన రాజకీయాల్లో వచ్చేందుకు చేస్తున్నారు అని కొందరు విమర్శించారు.  అయినా వాటిని పట్టించుకోకుండా తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ వచ్చారు.  ఇక ఆయన ఒక పార్టీ లో చేరితే, తమకు ఇమేజ్ వస్తుందని నమ్మి ఆయన్ని అన్ని రాజకీయ పార్టీలు ఆహ్వానించాయి. కానీ సోనుసూద్ ఆ ఆహ్వానాలను తిరస్కరించాడు.


కరోనా సమయంలో ఆయన స్థాపించిన ట్రస్ట్ ఇప్పటికీ సేవ కార్యక్రమాలు అందిస్తూనే ఉంది. తాజాగా ఆయన చంద్రబాబు నాయుడు తో భేటీ అయ్యారు. తమ సంస్థ నుంచి ఏపీ ప్రభుత్వానికి తమ వంతు సహాయంగా ఉచితంగా నాలుగు అంబులెన్సులను ఇచ్చి వెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో ఎన్నో ఉచిత అంబులెన్సులు అందిస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు.  సీఎం చంద్రబాబు నాయుడు సైతం సోనూసూద్ గొప్ప మనసుకి ముగ్దుడై, ఆయన్ని ట్విట్టర్ సాక్షిగా పొగడ్తలతో ముంచి ఎత్తుతూ అభినందనలు తెలిపాడు.  ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.


ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడతూ తెలుగు వాళ్లంటే తనకు అత్యంత ఆప్తులని.. అందులోను ఏపీ ప్రజలంటే చాలా ప్రత్యేకం అని అన్నారు. తన భార్య ఆంధ్రా అమ్మాయి అని గుర్తు చేసుకున్నారు. తెలుగువారికి సేవ చేయడం తన బాధ్యతగా భావిస్తాను అని అన్నారు. ఏపీ తనకు రెండో ఇల్లు అని అన్నారు. ప్రజలకెప్పుడూ ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉంటానని అన్నారు. అంబులెన్స్ సేవలు ఆంధ్రాలో మొదలు పెట్టి దేశం మొత్తం వ్యాప్తి చెందేలా ప్రయత్నిస్తానని సోనూసూద్ అన్నారు. తాము అందించిన అంబులెన్స్ ల్లో ఆపదలో ఉన్నవారికి భరోసా లభిస్తుందని సోనూసూద్ ఆశాభావం వ్యక్తం చేశారు.




మరింత సమాచారం తెలుసుకోండి: