గృహ హింస, మహిళలపై దోపిడీ చట్టాలను దుర్వినియోగం చేయడంపై గత కొంత కాలంగా దేశంలో చర్చ నడుస్తోంది. బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.  ఇది పక్కన పెడితే దేశంలో ఆత్మహత్యల విషయంలో మహిళల కంటే పురుషులే అధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.  వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా నిజం.


జాతీయ క్రైమ్ రికార్డు బ్యూరో ఇచ్చిన గణాంకాల ప్రకారం 2022లో భారతదేశంలో ఆత్మహత్యలు చేసుకున్న వారిలో 72 శాతం అంటే ఒక లక్ష ఇరవై అయిదు వేల మంది పురుషులు ఉంటే మహిళలు దాదాపుగా 47 వేల మంది దాకా ఉన్నట్లుగా తెలుస్తోంది. 2014 నుంచి 2021 మధ్యలో కంటే కూడా ఆత్మహత్యలలో పురుషుల మహిళల మధ్య నిష్పత్తిలో భారీ తేడా కనిపిస్తోంది అని గణాంకాలు తెలిపాయి.  ఈ పెరుగుదలలో ఎక్కువ శాతం అంటే 107.5 శాతం పురుషులు ఆత్మహత్యలు చేసుకుంటున్నది కేవలం కుటుంబ సమస్యల కారణంగానే అని ఆ గణాంకాలు తెలియచేస్తున్నాయి. 


ఈ ఆత్మహత్యల మీద అందులోనూ పురుషులు అధిక శాతం బలి కావడం మీద బీజేపీకి చెందిన ఎంపీ దినేష్ శర్మ రాజ్యసభలో జీరో అవర్ లో ప్రస్తావించారు.  ఆయన మాట్లాడుతూ దేశంలో గృహ హింస, మహిళల మీద దోపిడి వంటి చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బెంగళూరుకు చెందిన టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్యను ఆయన ప్రస్తావించారు. తప్పుడు ఆరోపణలతో చట్టాన్ని దుర్వినియోగం చేయడం ఒక ప్రమాదకరమైన ధోరణిగా మారిందని ఆయన అన్నారు. ఇలాంటి చట్టాల విషయంలో తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న మగవాళ్ళకు చట్టబద్ధమైన రక్షణతో పాటు భావోద్వేగమైన మద్దతుని కూడా అందించాల్సిన అవసరం ఉందని అన్నారు.  


గృహ హింస, వేధింపులకు సంబంధించిన చట్టాలను లింగ బేధం లేకుండా తటస్థం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గృహ హింస మహిళల మీద దోపిడీకి సంబంధించిన చట్టాల వల్ల మహిళలకు ఎంతో రక్షణ లభిస్తోందని అదే సమయంలో హింస దోపిడీల నుంచి పురుషులకు మాత్రం చట్టపరమైన రక్షణ లేకపోవడం బాధాకరమని దినేష్ శర్మ అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: