ఈ నేపథ్యంలోనే కూటమి సర్కారు రాగానే.. వైసీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాలను బుట్టదాఖలు చేస్తూ.. ప్రైవేటు అప్పగించారు. ఇక, ఇప్పుడు వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణంపై విజయవా డ పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశారు. ఈ బృందానికి విస్తృత అధికారాలు ఇచ్చారు. ఎక్కడైనా సోదాలు చేసేందుకు.. ఎవరినైనా ఎంతటి వారి నైనా ఎలాంటి వారెంటు లేకుండా ప్రశ్నించేందుకు.. ఆస్తులు జప్తు చేసుకునేందుకు కూడా అధికారాలు కట్టబెట్టారు.
ఈ నిర్ణయం .. లైట్ తీసుకునేంత ఈజీకాదు. కూటమిని సమర్థించే వారు కూడా.. అత్యంత ఆశ్చర్యపోయే అంశం. ఇన్ని విస్తృత అధికారాలు కల్పించారంటే.. అది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో ఊహిం చడమూ కష్టమే. గతంలో ఢిల్లీలోనూ.. ఇలానే లిక్కర్ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టాయి. ఏకంగా అప్పటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం.. ఆయన మంత్రి వర్గంలోని వారిని కూడా జైళ్లకు పంపించడం తెలిసిందే.
ఇప్పుడు ఇదే పద్ధతిలో మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి, అప్పటి ఎక్సైజ్ వ్యవహారాలు చూసిన పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి వంటివారిని అరెస్టు చేసినా.. అడిగే దిక్కులేనంతగా అధికారాలు ఇచ్చారు. అయితే.. ఇలా చేయడం వల్ల.. కూటమి సర్కారు సాధించేది ఏంటి? అనేది ప్రశ్న. మరింతగా రాజకీయ దుమారాల కు దారితీయడం తప్ప.. మార్పు వస్తుందా? అనేది ప్రశ్న. మరోవైపు.. ప్రస్తుత పాలసీలోనే అక్రమాలు జరుగుతున్నాయని అనుకూల మీడియా పెద్ద ఎత్తున కథనాలు రాస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేప థ్యంలో ఏపీలో ఢిల్లీ తరహా పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.