![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/editorial/77/jagan-ki-mass-reply-ichhina-vijaya-sai-reddya6df9e6f-a44e-4e6f-b7ee-7b4926486739-415x250.jpg)
వైసీపీలో నెంబర్ టూ అని ఎవర్నీ అడిగినా విజయసాయి రెడ్డి పేరే చెబుతారు. ఆయన జగన్ కు అత్యంత సన్నిహితుడు. పార్టీ వ్యవహారాలన్నింటిని ఈయనే దగ్గరుండి చూసుకునేవారు. అధికారంలో ఉన్న సమయంలోను కీలకంగా వ్యవహరించారు. కానీ అనూహ్యంగా ఏమైందో ఏంటో తెలియదు కానీ రాజకీయాల నుంచి సాంతం బయటకు వచ్చేశారు. ఇకపై రాజకీయాలు చేయనని.. ఏపార్టీలో చేరనని స్పష్టం చేశారు.
అయితే కష్టకాలంలో తనకు అండగా నిలబడినందుకు రాజ్యసభకు పంపించి తన కృతజ్ఞతను జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించారు.. ఐదేళ్లపాటు వీరిద్దరి మధ్య సఖ్యత సవ్యంగానే సాగింది. అయితే ఎవరు కూడా వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి బయటికి వెళ్తారని ఎవరూ ఊహించలేదు.. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విజయసాయిరెడ్డి బయటికి వెళ్లిపోయారు. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ ప్రకటన తెలుగు రాజకీయాలలో సంచలనంగా మారింది.
ఇటీవల లండన్ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. రాజకీయాలలో విశ్వసనీయత గురించి పదేపదే మాట్లాడారు. రాజకీయాలలో క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు. అయితే ఆ వ్యాఖ్యలు విజయసాయిరెడ్డిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి చేశారని గుసగుసలు వినిపించాయి. జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడిన మూడు రోజులకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదిక ద్వారా స్పందించారు.
” వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు. భయం అనేది నాలో ఏమాత్రం లేదు. కాబట్టి రాజ్యసభ పదవిని, పార్టీ పదవిని, రాజకీయాలను వదులుకున్నారని” విజయసారెడ్డి ట్విట్ చేశారు.
జగన్మోహన్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేయడంతోనే.. విజయసాయిరెడ్డి ఈ విధంగా ట్వీట్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయాలకు వీడ్కోలు పలికిన తర్వాత తనకు ఇష్టమైన వ్యవసాయం చేస్తానని ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే తన ఫార్మ్ హౌస్ లో ఉన్న ఫోటోలను ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద పరోక్షంగా విమర్శలు చేశారు. ఇటీవల షర్మిల కుటుంబాన్ని విజయసాయిరెడ్డి కలిశారు. ఆ తర్వాతే జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా విజయసాయిరెడ్డిని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం విశేషం.