కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తనను ఏమి చేయనీయడం లేదంటూ సుదీర్ఘకాలం పాటు ఆప్ అధినేత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా లెఫ్ట్నెంట్ గవర్నర్ .. పోలీసులు తనకు సహకరించడం లేదన్నారు. రహదారులను బాగు చేయటం.. నిర్మాణం, మౌలిక సదుపాయాలు కల్పనకు ఢిల్లీ కార్పొరేషన్ తనకు బలం లేనందున.. సాగటం లేదన్నారు. అయితే ప్రజలు 2022లో కార్పొరేషన్ పగ్గాలను కూడా ఆప్‌కే అప్పగించారు. అయిన తాజా ఎన్నికలలో ఢిల్లీలో ఓడిపోయింది. బిజెపి అధికారంలోకి వచ్చింది. ఆప్ హోటల్ కి ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి.
1) కేంద్రంపై నెపాలు :
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తనను ఏమీ చేయటం లేదంటూ ఇప్పటి వరకు కేజ్రీవాల్ చెప్పారు. చివరకు ఢిల్లీ ప్రజలు కార్పొరేషన్ పగ్గాలు కూడా ఆప్‌కే అప్పగించారు. అయినా అభివృద్ధి సాగలేదు. చెత్త సేకరణ.. డ్రైనేజీ నిర్వహణలో ఆయన వెనుకబడిపోయారు. ఈ వాతావరణం సామాన్యులకు సైతం విసుగు తెప్పించింది.
2) కనిపించిన అభివృద్ధి :
అధికారంలోకి వస్తే ఎన్నెన్నో చేస్తానని హామీలు గుప్పించిన పగ్గాలు చేపట్టాక ప్రజల ఆకాంక్షలతో అనుగుణంగా పని చేయలేదు. స్వచ్ఛమైన తాగునీరు .. విద్యుత్ , ప్రజా రవాణా సౌకర్యాలు వంటి వాటిలో వెనుకబడింది. యుమునా కాలుష్యాన్ని కలిగిస్తాం అన్న హామీ మాటలకే పరిమితమైంది.
3 ) అవినీతి ఆరోపణలు :
ఆప్ రెండో విడత పాలనలో అవినీతి ఆరోపణలు చుట్టు ముట్టాయి. కీలక నేతలు కేసుల్లో చిక్కుకున్నారు. సాక్షాత్తు కేజ్రీవాల్ సహా పలువురు జైలుకు వెళ్ళటం ముఖ్యురికి గురిచేసాయి మద్యం కుంభకోణం పార్టీకి ఇబ్బందిగా మారింది పోలింగ్కు కొన్ని రోజుల ముందు ఆఫ్ ఎమ్మెల్యేలు బిజెపిలో చేరడంతో పాటు కేజ్రీ పై ఆరోపణలు చేశారు
4 ) హామీలపై పేటెంట్ అవుట్ :
ప్రజలకు ఉచిత ఇవ్వటంలో పేటెంట్ తమది అనే భావించిన ఆప్‌నకు ఈసారి బిజెపి భారీ దెబ్బ కొట్టింది. ఇంతకన్నా వేగంగా దూసుకు వచ్చిన బిజెపి ప్రజలపై వరాల జల్లు కురిపించి ఆప్ హామీలను ఓవర్ టేక్ చేసింది. ఆప్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని అమలు చేస్తామని చెప్పడంతో పాటు అనేక ఇతర హామీలు కూడా కురిపించింది.
5 ) కేంద్ర బడ్జెట్లో వరాలు :
ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఢిల్లీ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపింది. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను పరిమితి మధ్యతరగతి జీవులను ఆకర్షించింది. ఎనిమిదవ వేతన సంఘం కూడా ఆకట్టుకుంది. కేజ్రీ వాల్ మోనార్క తరహా రాజకీయాలు నిర్ణయాలు ప్రజలకు నచ్చలేదు. ఇవన్నీ ఆప్ ఓటమికి కారణాలుగా కనిపిస్తున్నాయి.