![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/editorial/77/kejriwal-5a262100-4d1e-43ce-bdc7-030718b8bfe6-415x250.jpg)
ఢిల్లీ లో దాదాపు పదకొండేళ్ల పాటు అధికారంలో ఉన్న ఆప్ పై ఉన్న వ్యతిరేకతకు తోడు చుట్టుముట్టిన అవినీతి ఆరోపణలు ఇవన్నీ ఉన్నాయని తెలిసినా కూడా కేజ్రీవాల్ మితిమీరిన అహంకారంతో వెళ్లారు. తన మిత్రుల్ని కలుపుకుని పోవడంలో కేజ్రీవాల్ దారుణంగా విఫలమయ్యారు. ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ను దూరం చేసుకోవడమే కాదు.. అసలు కాంగ్రెస్ లేని ఇండియా కూటమిని ఏర్పాటు చేస్తామని గొప్పలకు పోవడం మొదటికే మోసం వచ్చేలా చేసింది.
ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి వచ్చిన ఓట్లు 47 శాతం ఓట్లు వచ్చాయి. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిన ఓట్లు 43 శాతం. రెండు పార్టీల మధ్య ఓట్ల శాతం నాలుగు ఉంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ కు ఏకంగా 7 శాతం ఓట్లు పడ్డాయి. ఢిల్లీ ఎన్నికలకు ముందు వరకూ కాంగ్రెస్ తో ఆప్ కలసి పని చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేశారు. ఆ స్నేహం అలాగే ఉంటే ఓట్ల బదిలీ జరిగి ఆప్ గెలిచి ఉండేది. ఉదాహరణ కు కేజ్రీవాల్, సిసోడియా వంటి వాళ్లు స్వల్ప తేడాతో ఓడిపోయారు. వారైనా ఓటమి నుంచి బయటపడి ఉండేవారు. ఏదేమైనా కాంగ్రెస్ ను చులకనకగా చూడడం ఆప్ కు ఘోర పరాభవం మిగిల్చింది.