![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/editorial/77/delhi-47a3ca59-a960-46d5-93be-35433e61161c-415x250.jpg)
దేశ వాణిజ్య రాజధాని ముంబై రాజధానిగా కలిగిన మహారాష్ట్రలో పట్టు కలిగి ఉండటం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చాలా కీలకం. ఈ విషయంలో బిజెపి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఇక రెండు దశాబ్దాలుగా బిజెపికి కంట్లో నలుసలా మారింది ఢిల్లీ. అక్కడ కేజ్రీవాల్‌ను కూడా బిజెపి దెబ్బకొట్టింది. దేశమంతా నెగ్గిన కేజ్రీ చేతిలో దేశ రాజధానిలో బిజెపి చిత్తుచిత్తుగా ఓడేది. ఇప్పుడు అలాంటి అవమానం లేకుండా మంచి మెజార్టీతో ఢిల్లీలో బిజెపి ప్రభుత్వానికి రంగం సిద్ధమవుతోంది. ఇక బిజెపి ముందు వచ్చే లోక్సభ ఎన్నికలలోపు ఒక పెద్ద టార్గెట్ ఉంది.. అదే పశ్చిమ బెంగాల్.
సరిగ్గా పశ్చిమబెంగాల్ ఎన్నికలకు ఏడాదికాలం ఉంది. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు గత పర్యాయమే అదిగో ఇదిగో అన్నట్టుగా అక్కడ బిజెపి హడావుడి సాగింది. అయితే మమతను ఎమ్మెల్యేగా ఓడించినా.. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ సవాను కొంచెం కూడా అడ్డుకోలేకపోయింది. బిజెపి ప్రస్తుతం అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. మహారాష్ట్ర - ఢిల్లీ ఎన్నికల్లో తమ అనుకున్న లక్ష్యాన్ని సాధించిన బిజెపి నెక్స్ట్ టార్గెట్ పశ్చిమ బెంగాల్ మరియు వచ్చే ఎన్నికల్లో నాటికి మమత కూడా మూడు పర్యాయాలు అధికారాన్ని పూర్తి చేసుకుంటుంది. ఈ క్రమంలో ఆమెపై గట్టిగా వ్యతిరేకత ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.