దేశంలో 40 ఏళ్లు ఏకచత్రాధిపత్యం సాగించింది కాంగ్రెస్‌ పార్టీ.  కేంద్రంలోనూ, రాష్ట్రాలోలనూ ఆ పార్టీనే అధికారంలో ఉండేది.  ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.  బీజేపీ క్రమంగా పుంజుకుని.. కాషాయ భారతంగా మారిపోయింది.  వరసగా ఒక్కో రాష్ట్రం బీజేపీ ఖాతాలో వచ్చి చేరుతోంది. 


దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. అందులో 20 రాష్ట్రాల్లో సొంతంగా లేదా మిత్ర పక్షాలతో కలిపి బీజేపీ అధికారంలో ఉంది.  ఉత్తరాదితోపాటు పశ్చిమ, మధ్య భారత్‌లోని అనేక రాస్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. ఈశాన్య రాష్ట్రాల్లోనూ హవా చాటుకుంది. దక్షిణాన చూస్తే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కర్ణాటకలో ఛాన్స్ కోసం ఎదురు చూస్తోంది.  కేరళ, తమిళనాడు మాత్రం బీజేపీకి చిక్కడం లేదు.  


విపక్షాలను చూస్తే కాంగ్రెస్‌ హిమాచల్‌ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో మాత్రమే అధికారంలో ఉంది. కేరళలో వామపక్ష పార్టీలు, తమిళనాడులో డీఎంకే, పశ్చిమబెంగాళ్‌లో తృణమూల్‌ కాంగ్రెస్, పంజాబ్‌లో ఆప్‌ అధికారంలో ఉన్నాయి.  జమ్మూ కశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధికారంలోకి వచ్చింది. అంటే ప్రత్యర్థి పార్టీలన్నీ కలిసి కూడా 8 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉన్నాయి.  


మిగిలిన రాష్ట్రాల్లోని పశ్చిమబెంగాల్, తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌పై బీజేపీ కన్నేసింది.  వచ్చే ఎన్నికల్లో ఈ రాష్ట్రాలను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది.  ఇందుకు ఇప్పటికే ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.  మొత్తంగా బీజేపీ దూకుడు చూస్తుంటే దేశం మొత్తం కాషాయ మయం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈమేరకు విస్తరణకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది.  విపక్షాల అనైక్యత బీజేపీకి కలిసి వస్తోంది.


దేశం మొత్తం కాషాయమయం చేయాలని లక్ష్యంగా బీజేపీ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో పార్టీకి బలమైన పునాదులు వేస్తోంది.  ఉత్తరాన వ్యతిరేకత ఉన్న మితా ప్రాంతాల్లో మద్దతు పొందేలా.. దక్షిణాన వ్యతిరేకత ఉన్నా.. ఉత్తరాదిన మద్దతు పొందేలా వ్యూహాత్మకంగా కమలం పార్టీ ముందుకు సాగుతోంది.  మొత్తంగా కాంగ్రెస్‌ ముక్త భారత్‌ లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp