కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రైతాంగం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసా డబ్బులను వారి ఖాతాల్లో జమ చేస్తోంది.  కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో రైతు భరోసా ఒకటి.  ఈ పథకంలో భాగంగా ఎకరా భూమి ఉన్న రైతులకు సంవత్సరానికి రూ.12,000 చొప్పున నగదు సాయం చేస్తామని తెలిపారు. 


మొదటి విడత సందర్భంగా జనవరి 26 నుంచి ఒక ఎకరం లోపు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులను అందించారు.  తాజాగా రెండు ఎకరాల లోపు రైతులకు నగదును జమ చేశారు.  మొత్తం రెండు దశల్లో కలిపి ఇప్పటివరకు 34 లక్షల 75 వేల 994 మంది రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు అయినట్లు తెలుస్తోంది.


రైతు భరోసా నిధులు జమ కావడంతో రెండ ఎకరాల లోపు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ రైతు భరోసా కింద ఏడాదికి రూ. 15,000 ఇస్తానని ప్రకటించింది. కానీ రూ 12 వేలకు కుదించారు.  గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకు ఏడాదికి రూ, 10,000 సాయాన్ని అందించింది.  కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 5000 ఎక్కువగా ఇస్తానని పేర్కొంది.  కానీ రూ .12000 మాత్రమే ఇస్తానని చెప్పడంతో కొందరు రైతులు నిరాశతో ఉన్నారు.  రాష్ట్ర ఖజానా ఆందోళన కరంగా ఉండడంతోనే రూపం 2000 అందిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు.


ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా రైతు భరోసా నిధులు అందించాలా లేదా అని సందిగ్ధంలో ఉన్నట్లు తెలిసింది. కానీ ఈ పథకం ఇప్పటికే ప్రారంభం అయినందున నిధులు అందించవచ్చు క్లారిటీ తీసుకున్న తర్వాతే రైతు భరోసా నిధులు జమ చేస్తున్నట్లు సమాచారం. అందుకే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లోకి జమ కావడానికి ఆలస్యం అవుతున్నాయని కొందరు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా రైతు భరోసా నిధులు రావడంతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: