చైనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  భారీగా ఉన్న జనాభా దానికి ప్లస్ పాయింట్. రానున్న కాలంలో ఆ జనాభా భారీగా పడిపోయే అవకాశం ఉండడం చైనాకు నిద్రపట్టకుండా చేస్తోంది.  ఇందుకు కారణం చైనాలో వివాహాల సంఖ్య నిరంతరం తగ్గిపోతుంది.  అదే సమయంలో దేశంలో వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతుంది.  మరోవైపు యువత పెళ్లి మీద ఆసక్తి చూపడం లేదు. దీని కారణంగా భవిష్యత్తులో సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.


2024 సంవత్సరంలో చైనాలో కేవలం 61 లక్షల వివాహాలు జరిగాయి.  2023లో ఈ సంఖ్య 77 లక్షలు నమోదయ్యాయి. అంటే పెళ్లిళ్లు 20శాతం తగ్గినట్లు.  తక్కువ జనన రేటు నమోదవుతున్న చైనాలో ఉన్న ఒకే ఒక అవకాశం.. ఇక్కడ ఉన్న యువత పెళ్లిళ్లు చేసుకుని పిల్లలను కనడమే.  ప్రభుత్వం దీని కోసం ప్రజలను ప్రోత్సహిస్తోంది.  కానీ కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఒకే బిడ్డ విధానాన్ని అవలంబించిన చైనా ఇప్పుడు జనాభాను ఒకేసారి పెంచలేకపోతోంది.


చైనాలో వివాహాల సంఖ్య తగ్గుతోంది  అని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. ప్రభుత్వ విజ్ఞప్తి యువతలో ఎలాంటి ప్రభావం చూపడం లేదు. ముఖ్యంగా ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థ క్షీణత కారణంగా ప్రజలు పెళ్లిళ్లు చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు.  పెరుగుతున్న ఖర్చుల కారణంగా కుటుంబ బాధ్యతలు మోయలేక చేసుకున్న వివాహాలను కూడా రద్దు చేసుకుంటున్నారు.  2014లో 26 లక్షల జంటలు విడాకులు తీసుకున్నాయి.  ఈ సంఖ్య 2023 కంటే ఒక శాతం ఎక్కువ. 2024 లో వివాహాలు తగ్గడానికి కారణం ఈ సంవత్సరం వివాహానికి మంచి సమయంగా కూడా కాదని భావిస్తున్నారు. చైనా నమ్మకం ప్రకారం 2024 సంవత్సరాన్ని వితంతువు సంవత్సరంగా ప్రకటించారు.


చైనాలో జనన రేటులో స్వల్ప పెరుగుదల ఉంది. కానీ 2024 సంవత్సరం వరుసగా జనాభా తగ్గిన వరుసగా మూడో సంవత్సరం అవుతుంది.  చైనాతో పాటు దక్షిణ కొరియా, ఇటలీ, రష్యా వంటి దేశాలు కూడా జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.  భారతదేశంలో కూడా ఉన్నత తరగతిలో తక్కువ సంఖ్యలో పిల్లలు కనిపిస్తున్నారు. దేశ ఆర్థికాభివృద్ధితో పాటు భారతదేశంలో కూడా యువ జనాభా సంక్షోభం కూడా తలెత్తవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: