![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/editorial/77/jana-senaf9b21ab7-ad3a-425e-b693-064581a623a5-415x250.jpg)
ఆంధ్రప్రదేశ్ లో జనసేన అధికారం లో ఉంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక మంత్రి త్వ శాఖలకు మంత్రి గా ఉండడంతో పాటు ఉప ముఖ్యమంత్రి గా కూడా ఉన్నారు. జనసేనకు ప్రభుత్వంలో మంత్రి త్వ శాఖలు దక్కడంతో పాటు ఆ పార్టీకి ఇద్దరు ఎంపీ లు కూడా ఉన్నారు. జనసేన నుంచి పదవులు ఆశించే నాయకులు జిల్లాల వారీగా చూస్తే చాలా మందే ఉన్నారు. అయితే ఇంత మంది ఉన్నా కూడా జనసేన కు ఇంకా సంస్థాగత మైన ఇబ్బందులు ఉన్నాయి. జనసేన లో నాయకుల కొరత తీవ్రంగానే ఉంది.
పైకి కనిపిస్తున్న నాయకులు అందరూ పని చేయడానికి తక్కువ .. వివాదాలు క్రియేట్ చేసేందుకు ఎక్కువ అన్నట్టుగా ఉంది. దీంతో జనసేన లో క్షేత్ర స్థాయిలో నాయకుల బలం చాలా తక్కువుగా ఉంది. ఇక కార్యకర్తల విసయానికి వస్తే సినిమా అభిమానులు .. పవన్ అభిమానులే మెజారిటీ కార్యకర్త లుగా ఉన్నారు. దీంతో జనసేనకు నాయకుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితి .. ఇప్పటికిప్పుడు రాజకీయంగా ఇబ్బందులు లేకపోయినా . . భవిష్యత్తు లో మాత్రం పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది.
జనసేన కు పవన్ సినీ గ్లామర్ ఉంది.. ఇది ఎప్పుడూ పని చేస్తుందని అనుకోలేం. పార్టీ సంస్థాగతంగా మరింత గా బలపడాల్సి ఉంది. ఎక్కడికక్కడ . . అన్ని జిల్లాల్లోనూ బలమైన నాయకులు ఉండాలి. ఎన్టీఆర్ కూడా తొలిసారి సినీ గ్లామర్ తోనే నెట్టుకు వచ్చారు... గెలిచి సీఎం అయ్యారు. ఆ తర్వాత ఆయన పాలన తోనే ఆయన మళ్లీ మళ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రజల మనస్సులు గెలుచుకున్నారు. ఏదేమైనా పవన్ బలమైన నాయకత్వాన్ని తయారు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.