![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/editorial/77/chandrababu44a32e0e-1b9b-429d-a8f8-81b0872b39a5-415x250.jpg)
అయితే.. దీనిలో మాతృవందనానికి సంబంధించిన నిధులు చేర్చలేదన్నది ప్రభుత్వ వర్గాల్లో జరుగు తున్న చర్చ. వచ్చే ఆర్థిక సంవత్సరం(ఏప్రిల్-మార్చి 2026)లో మధ్యలో ఎప్పుడైనా దీనిని ప్రారంభించా లని తొలుత భావించారు. అందుకే.. వచ్చే సంవత్సరం నుంచి దీనిని అమలు చేస్తామని చెబుతున్నారు. పైగా.. లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉండడంతోపాటు.. ఇంట్లో ప్రతి బిడ్డకూ.. రూ.15000 చొప్పున ఇస్తామని చంద్రబాబు ఎన్నికల్లో ప్రకటించిన నేపథ్యంలో ఒక్కరికి అమలు చేసినా సుమారు 75 వేల కోట్ల కు పైగా సొమ్ములు కావాల్సి ఉంది.
గతంలో జగన్ ప్రభుత్వం 60 వేల కోట్ల రూపాయలను ఏటా అమ్మ వడి కార్యక్రమానికి పంపిణీ చేసింది. ఇప్పుడు అంతేమొత్తం ఇవ్వాలని అనుకున్నా.. ప్రాథమికంగా 75 వేల కోట్లు కావాలి. ఇక, పూర్తిస్థాయిలో ఈ పథకాన్ని అమలు చేయాలంటే.. 150 నుంచి 200 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని అంచనా వేసుకున్నారు. దీంతో బడ్జెట్‌లో ఈ కేటాయింపుల విషయం తర్జన భర్జనగా ఉండడంతో దీనికి నిధులు కేటాయింలేదని సమాచారం. అయితే.. ప్రజల నుంచి ఈ పథకంపైనే ఎక్కువగా ఫోకస్ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఇప్పుడు.. ఎట్టి పరిస్థితిలోనూ.. దీనికి నిధులు కేటాయించాల్సిందేనని పట్టుబడుతున్నారు.
వైసీపీ చేస్తున్న వ్యతిరేక ప్రచారం.. ప్రజల్లోకి ముఖ్యంగా మహిళల్లోకి వెళ్లకముందే.. మాతృవందనంపై పూర్తిస్థాయిలో చర్చ జరగాలన్నది చంద్రబాబు నిర్దేశం. ఈ పథకానికి నిధుల సమస్య ఉన్నప్పటికీ.. అవసరమైతే.. అప్పు చేసైనా.. అమలు చేయాలని తీర్మానం చేసినట్టు తెలిసింది. గతంలో వైసీపీ కూడా అప్పులు చేసే పథకాలు అమలు చేసిందని.. కాబట్టి ఈ ఏడాదికి అప్పు చేసి.. వచ్చే వార్షిక సంవత్సరం నుంచి.. రాష్ట్ర ఆదాయం ద్వారా వచ్చే సొమ్మును కేటాయించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మలకు.. మాతృవందనం ఆపకుండా చూడనున్నారు. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.