![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/editorial/77/jagane3dd7cc3-856b-4bbb-b4ae-116cfe66d55b-415x250.jpg)
రాజకీయాలు ఎప్పుడు ఇలాంటి టర్న్ తీసుకుంటాయో ఎవరికీ తెలియదు .. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ? ఎవరు ఊహించలేరు .. నిన్న మొన్నటి వరకు వైసిపి నాయకురాలు మాజీ మంత్రి రోజా సోదరుడు టిడిపి కండువా కప్పుకుంటారని వార్తలు వచ్చాయి .. కానీ జరగలేదు. ఇప్పుడు మాత్రం రోజాకు పెద్ద షాక్ తగులుతుంది. నగరి నియోజకవర్గంలో టిడిపి సీటింగ్ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ నాయుడు తమ్ముడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు రెండో కుమారుడు గాలి జగదీష్ నాయుడు వైసీపీలో చేరుతున్నారు. దీనికి సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. గాలి జగదీష్ నాయుడు మామ వైసీపీ అధినేత జగన్కు అత్యంత సన్నిహితులు కావడంతో జగదీష్ వైసీపీ చేరిక సులువు అయిపోయింది. ఈ పరిణామాలు రెండు రకాలుగా రాజకీయ షాకులు ఇస్తున్నాయి. వైసీపీ నాయకురాలు రోజాకు సెగ పెడుతుండటం గాలి జగదీష్ పార్టీలో చేరిక ముందే గత 2019 ఎన్నికల నుంచి కూడా వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు.
ఇప్పుడు నేరుగా ఆయన పార్టీలోకి వస్తున్నారు. దీంతో నగరి నియోజకవర్గంలో రోజా హవాకు బ్రేకులు పడే అవకాశం కనిపిస్తోంది. ఇక రెండో షాక్ టీడీపీకి తగలనుంది. సొంత టిడిపి నేత ఎమ్మెల్యే గారు గాలి భాను ప్రకాష్ నాయుడు సోదరుడు పార్టీ మారి వైసిపి లోకి చేరుతున్నారంటే అది కూటమీ ప్రభుత్వా న్ని నడిపిస్తున్న టిడిపికి కూడా ఇబ్బంది. ఈ విషయం వెలుగు చూడగానే తిరుపతి జిల్లా టిడిపి నాయకులు అలర్ట్ అయ్యారు. గాలి జగదీష్ తో రహస్య మంత్రాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయినా కూడా వైసిపి నుంచి ఆయనకు బలమైన హామీ ఉండడంతో ఆయన వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనకు జగన్ ఎమ్మెల్సీ ఆఫర్ చేసిన తనుకు వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యే టికెట్ కావాలని పట్టుబట్టినట్టు తెలుస్తోంది.