ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.  త్వరలోనే మరో రెండు కొత్త నిర్ణయాలకు ప్రభుత్వం ముందడుగు వేయబోతోంది.  ప్రభుత్వ పథకాలను పొందేందుకు ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ముఖ్యం.  ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నూతన రేషన్ కార్డులను మంజూరు చేసింది.  అదే తరహాలో ఏపీ ప్రభుత్వం కూడ అతి త్వరలో నూతన రేషన్ కార్డులను అందించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.  


అర్హత ఉండి కూడ రేషన్ కార్డు లేని వారి జాబితాను సిద్ధం చేస్తున్నారు. దీంతో త్వరలోనే నూతన రేషన్ కార్డులను మంజూరు చేసి, అర్హులకు మేలు చేకూర్చాలని ప్రభుత్వం భావిస్తోంది.  నూతన పింఛన్ లను కూడా మంజూరు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే పింఛన్ పొందుతున్న అనర్హులను గుర్తించేందుకు అధికారులు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించారు.  దాంతో త్వరలోనే నూతన రేషన్ కార్డులతో పాటు నూతన పింఛన్ లను కూడ అందించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది.


ఇప్పటికే సూపర్ సిక్స్ అంటూ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, ఓ వైపు రాష్ట్రంలోని రహదారుల అభివృద్ది, మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు కూడ చేయడంతో విద్యార్థి సంఘాలు ఆనందం వ్యక్తం చేశాయి. అంతేకాదు ఆఫీసుల చుట్టూ.. ప్రజలు కాళ్లరిగేలా తిరిగే సమస్యలకు చెక్ పెడుతూ.. వాట్సాప్ గవర్నెన్స్ ను కూడ అమలు చేసింది.


కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, పింఛన్ నగదును పెంచి లబ్దిదారులకు పంపిణీ చేస్తోంది. అలానే దీపం 2.ఓ పథకాన్ని అమలుతో ఏడాదికి మూడు సిలిండర్లను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే మరో రెండు కొత్త నిర్ణయాలను తీసుకురానుండం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.  గత కొన్నేళ్ల నుంచి నూతన ఫించన్లు, నూతన రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: