![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/editorial/77/kcre2430769-4afb-477b-9a17-f49bd91240a3-415x250.jpg)
భారతీయ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఇప్పుడు పార్టీ కార్యకర్తలకు కాస్త టైం ఇస్తున్నారు. వారానికి ఒకరోజు అయినా కొంతమందికి సమయం ఇస్తున్నారు. అంటే వచ్చే ఎన్నికల నేపథ్యంలో మెల్లమెల్లగా ఆయన జనంలోకి వస్తున్నారని అనుకోవచ్చు. ఈ క్రమంలోని ముందుగా కేసిఆర్ తన దగ్గరికి జనాలను పార్టీ కార్యకర్తలను పిలిపించుకుంటున్నారు. తర్వాత ఆయన జనంలోకి రావచ్చు. అయితే కేసీఆర్ ఇప్పుడు ఇలా బయటకు రావడానికి ఉప ఎన్నికలపై పెట్టుకుంటున్న ఆశలే కారణంగా కనిపిస్తున్నాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో బిఆర్ఎస్ రెండు పిటిషన్లు సుప్రీంకోర్టులో ఇప్పటికే వేసింది. ఈ రెండు పిటిషన్లలోను సుప్రీంకోర్టు అసెంబ్లీ కార్యదర్శి పై అసహనం వ్యక్తం చేసింది. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని అసెంబ్లీ కార్యదర్శి చెబుతున్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు పట్టుబడుతూ ఉండడంతో ఈరోజు కాకపోతే రేపైనా పార్టీ మారిన ఎమ్మెల్యే లపై అనర్హత వేటుపడుతుందని బిఆర్ఎస్ పెద్దలు అలర్ట్ అయ్యారు.
అందుకే కేసీఆర్ ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నచోట్ల అంటే పార్టీ ఫిరాయింపులు చోటు చేసుకున్న చోట కార్యకలాపాలను బాగా యాక్టివ్ చేస్తున్నారు. స్టేషన్ ఘనపూర్ లో ఉప ఎన్నికలు వస్తాయని అభ్యర్థిగా రాజయ్య పోటీ చేస్తారని గెలుస్తారని కేసీఆర్ ప్రకటించారు. అలాగే అక్కడ కొంతమంది నేతలను రాజుగా పార్టీలో చేర్పించారు. ఇప్పటికే రాజయ్యకు టిక్కెట్ ప్రకటించారు. గత ఎన్నికల్లో రాజయ్యకు టికెట్ నిరాకరించి కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. రాజయ్య ఎన్నికల అయిపోయిన తర్వాత టిఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరే ప్రయత్నం చేశారు .. కానీ ఆయనను చేర్చుకునేందుకు కాంగ్రెస్ ఒప్పుకోలేదు. దీంతో రాజయ్య మళ్ళీ బిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ సీఎం గా చేశారు. 2023లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయనకు టికెట్ కేటాయించారు. మరోవైపు జగిత్యాలలో ఉప ఎన్నికలు వస్తాయని కేసీఆర్ కుమార్తె కవిత అక్కడ పార్టీ కార్యక్రమాలను యాక్టివ్ చేశారు. అత్యంత నమ్మకంగా సంజయ్ కుమార్ కు ఛాన్స్ ఇచ్చి గెలిపిస్తే ఆయన కాంగ్రెస్లో చేరటాన్ని కవిత సహించలేకపోతున్నారు. ఉప ఎన్నికలు వస్తే ఎలాగైనా సంజయ్ ని ఓడించాలని కవిత కసితో పని చేస్తున్నారు.