- ( రాయ‌ల‌సీమ‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

వైసిపి నాయకురాలు మాజీ మంత్రి నగరి మాజీ ఎమ్మెల్యే .. ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మధ్య రాజకీయ విభేదాలు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. రోజా తొలిసారి నగరి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి పెద్దిరెడ్డికి .. రోజాకు మధ్య అసలు పడటం లేదు. కేజే కుమార్‌ దంపతులను తన నియోజకవర్గంలో ప్రోత్సహించి తనను దెబ్బతీసేందుకు పెద్దిరెడ్డి ప్రయత్నించారంటూ రోజా మంత్రిగా ఉన్నప్పుడు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో తనకు చెప్పకుండానే పెద్దిరెడ్డి నగరిలో రాజకీయాలు చేస్తున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా మొదలైన వీరిద్దరి రాజకీయాలు పిక్ స్టేజ్ కు చేరాయి. ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే రోజా గత ఎన్నికలలో ఓడిపోయారు .. పెద్దిరెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు .. వైసీపీ రాష్ట్రంలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఓడిన .. గెలిచిన నాయకులు పార్టీ కోసం తమ తమ నియోజకవర్గంలో పని చేయాల్సి ఉంటుంది.


ఇప్పుడు పార్టీ అధికారంలో లేకపోయినా కూడా రోజా పెద్దిరెడ్డి మధ్య రాజకీయ వివాదాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. తాజాగా పెద్దిరెడ్డి సహకారంతోనే నగరి లో సిట్టింగ్ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ సోదరుడు గాలి జగదీష్ నాయుడు వైసీపీలో చేరుతున్నట్టు వైసిపి వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఓట‌మి త‌ర్వాత కొన్నాళ్లు సై లెంట్ గా ఉన్న రోజా ఇటీవల మళ్లీ తన నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. ఇలాంటి సమయంలో ఆమెకు పోటీగా మరో నేతను చేర్చు కోవ‌డం .. అందులోనూ త‌న‌కు చెప్ప‌కుండా త‌న సొంత పార్టీ ప్ర‌త్య‌ర్థి పెద్దిరెడ్డి ఇదంతా చేస్తుండ‌డం స‌హ‌జంగానే రోజాకు న‌చ్చ‌లేదు. జగదీష్ చేరిక అంశంపై రోజాకు సమాచారం ఇవ్వలేదట‌.. దీంతో రోజా జ‌గ‌దీష్ చేరిక అడ్డుకునేలా వైసీపీ అధినేతపై ఒత్తిడి తెస్తున్నార‌ని తెలిసింది.  మ‌రి జ‌గ‌న్ ఏంచేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: