![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/editorial/77/-revanth-reddy7153236c-b853-45ab-ba33-f8c8f61560c8-415x250.jpg)
దసరా వెళ్ళిపోయింది .. దీపావళి .. క్రిస్మస్ .. సంక్రాంతి కూడా వెళ్లిపోయాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరి ఏడాదిన్నర అవుతోంది. అయినా తెలంగాణ క్యాబినెట్ విస్తరణ మాత్రం ఎప్పుడు జరుగుతుందో ? ఎవరికీ తెలియడం లేదు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన హైదరాబాద్ - రంగారెడ్డి - నిజామాబాద్ - అదిలాబాద్ తదితరు జిల్లాలకు అసలు మంత్రివర్గంలో స్థానం లేదు. మరోవైపు పరిపాలనలో ఎంతో ముఖ్యమైన హోమ్ - విద్య - మునిసిపల్ - కార్మిక శాఖల మంత్రులు కూడా లేరు. పరిపాలనలో ఏమాత్రం గత అనుభవం లేని రేవంత్ రెడ్డి నేరుగా ముఖ్యమంత్రి అయిపోయారు. పైగా కీలక శాఖలు అన్ని ఆయన తన వద్ద ఉంచుకున్నారు. ఇవన్నీ పలు విమర్శలకు కారణం అవుతుంది. ఇప్పటికే మూసి - హైడ్రా నిర్ణయాలు అన్ని ఆలోచించి చేయాల్సిన ప్రభుత్వం ముందు నిర్ణయాలు ప్రకటించి తర్వాత విమర్శలు రావడంతో దిద్దుబాటు చర్యలకు దిగుతూ ఉండటం రేవంత్ రెడ్డి అనుభవరాహిత్యాన్ని బయటపెట్టిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పదేళ్ల పోరాటం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు పదవులు ఇచ్చి జోష్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు కనిపిస్తోందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కొన్ని నెలలపాటు అసలు మంత్రివర్గం లేకుండా పాలన సాగిస్తే తెలంగాణ జనాలు చిత్తుచిత్తుగా ఓడించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏకంగా ఏడాదిన్నర పాటు కీలక శాఖలకు మంత్రులు లేకుండా పాలన చేస్తున్నారు. ఏడాదిన్నర పాటు ఆరుగురు మంత్రి పదవి హోదాను కోల్పోయినట్టు అయింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులలో తీవ్ర నిరాశాన్ని స్పృహలు వ్యక్తం అవుతున్నాయి. కేసీఆర్ ఎలాంటి తప్పు చేశాడో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అలాంటి తప్పు చేస్తూ ఓడిపోబోతున్నాడా అనే చర్చలు తెలంగాణ వర్గాలలో వినిపిస్తున్నాయి.