వైసీపీ సోషల్ మీడియా వింగ్, కార్యకర్తల నుంచి తనను కాపాడాలంటున్నాడు సినీ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ. ఆయన తాజాగా ఈ విషయంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఇటీవల లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆయన్నువైసిపి సోషల్ మీడియా వింగ్ టార్గెట్ చేసింది. గత రెండు రోజులుగా ఫోన్ కాల్స్, మెసేజ్స్ పెడుతూ.. వేధిస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కుటుంబ సమేతంగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ ఫిర్యాదు చేశారు.



తాను ఒక నటుడిగా సినిమా ఫంక్షన్ వేదిక పై మాట్లాడిన మాటలను వైసీపీ సోషల్ మీడియా టార్గెట్ చేశాయని...పృథ్వి తెలిపారు. తాను ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు మాట్లాడలేదని.. అక్కడికి వచ్చిన ప్రేక్షకులను నవ్వించడానికే అలా మాట్లాడనని 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ పేర్కొన్నారు. కానీ అది వైసీపీ అనువాదిస్తూ ప్రచారం చేసుకున్నారని... గత రెండు రోజులుగా తనను సోషల్ మీడియాలో తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారని  30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ వెల్లడించారు.


నా ఫోన్ నెంబర్ వైసీపీ సోషల్ మీడియా గ్రూప్ లో పెట్టి... సుమారు 1800 కాల్స్ చేయించారని 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ అంటున్నారు.  నా భార్యను, తల్లిని, పిల్లలను తిట్టించారని  30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ పేర్కొన్నారు. వారి వేధిపులకు తాను హాస్పిటల్ లో జాయిన్ అయ్యానని 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ అన్నారు.



అనిల్ అనే పేరుతో పోస్టులు పెట్టిన వ్యక్తిపై ఆధారాలతో సహా... సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ తెలిపారు. ఏపీ హోంమంత్రి ను కలిసి వారిపై త్వరలో ఫిర్యాదు చేస్తానని 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ అన్నారు. తనను వేధించిన వారిపై కోటి రూపాయల పరువునష్ట దావా వేస్తానని పృథ్వి వెల్లడించారు. గత రెండు రోజులుగా తన భర్త ను మానసికంగా వేధిస్తున్నారని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని... పృథ్వి భార్య పద్మరేఖ కూడా  పోలీసులను కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: