గోపాల్ యాదవ్ ఎన్నికల్లో వైసీపీ గెలుపుకోసం విస్తృతంగా ప్రచారం చేశారు. జగన్ కూడా గోపాల్ పట్టుదల చూసి నూజివీడు నియోజకవర్గానికి పార్టీ ఎన్నికల పరిశీలకుడిగా నియమించారు. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు. చాలా తక్కువ టైంలోనే గోపాల్‌కు దక్కిన గుర్తింపు ఇది. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినా రాజకీయంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు గోపాల్. భవిష్యత్తులో వైసీపీలో మరింత స్ట్రాంగ్‌గా ఎదిగేందుకు బలమైన పునాదులు వేసుకుంటున్నారు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో చట్టసభలకు పోటీ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. ఈ సారి వైసీపీలో ఆ ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకూడదనే టార్గెట్‌గా పెట్టుకున్నారు.
అటు రాజకీయాలతో పాటు ఇటు వ్యాపారాలు బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇప్పటికే మరి కొన్ని దేశాల్లో తన వ్యాపార సామ్రాజ్యం విస్తరిస్తూ.. ఇటు స్థానికంగా కూడా యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. కామవరపుకోట - లింగపాలెం - టి. నరసాపురం మండలాల సరిహద్దులో చింతలపూడి ప్రధాన రహదారిని ఆనుకుని ఎంతో ప్రతిష్టాత్మకంగా జీ మార్ట్ ఏర్పాటు చేసి 40 మంది యువకులకు ఉపాధి కల్పించారు. స్థానిక యువతికి ఉపాధి కల్పన కోసం ఇలాంటి మార్ట్‌లు మరికొన్ని ఏర్పాటు చేయబోతున్నారు.
ఈ సారి చట్ట సభలకు పోటీ గ్యారెంటీయే... ?
బీసీల్లో బలమైన వర్గానికి చెందిన నేత కావడంతో పాటు ఆర్థికంగా కూడా కాస్త పరపతి ఉండడంతో ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ చట్ట సభలకు పోటీ చేసే అవకాశం వదులుకోకూడదని గోపాల్ భావిస్తున్నారు. సునీల్ కుమార్ కాని పక్షంలో ఏలూరు నుంచే పార్లమెంటుకు పోటీ చేయాలని.. నియోజకవర్గాల పునర్విభజన జరిగి మెట్టలో జనరల్ నియోజకవర్గం ఏర్పడితే దాని నుంచి అసెంబ్లీకి అయినా పోటీ చేస్తాననే అంటున్నారు. ఈ లోగా పార్టీలో మరింత కీలకంగా మారే ప్రయత్నాల్లో కూడా ఉన్నారు. ఈ యేడాది చివరి నుంచి లేదా వచ్చే యేడాది ఆరంభం నుంచి రాజకీయంగా లోకల్‌గానే ఉంటూ మరింత యాక్టివ్ అయ్యే ప్రయత్నాల్లో గోపాల్ ఉన్నారు.