![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/editorial/77/gbs42518dba-a81a-4e44-a416-9f9053ecdf0e-415x250.jpg)
ఏపీని మరో కొత్త వ్యాధి వణికిస్తోంది. జీబీఎస్ సిండ్రోంగా చెప్పే ఈ వ్యాధి కేసులు ఏపీలోని పలు నగరాల్లో నమోదవుతున్నాయి. గుంటూరు జీజీహెచ్ కు వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు.. అక్కడ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. గుంటూరు జీజీహెచ్ లో ఏడు జీబీఎస్ కేసులు నమోదు అయ్యాయి. న్యూరాలజి విభాగంలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడిన కృష్ణ బాబు .. వారికి అందిస్తున్న చికిత్స గురించిన వైద్యులతో మాట్లాడారు.
జీబీఎస్ సిండ్రోం చికిత్స గురించి ఆయనకు జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ, న్యూరాలజి హెడ్ సుందరాచారి వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఏమన్నారంటే.. రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది జీబీఎస్ బాధితులు ఆసుపత్రుల్లో ఉన్నారు.. గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ బోధన ఆస్పత్రుల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నాం.. జీబీఎస్ సిండ్రోం గురించి ప్రజలుభయ పడాల్సిన అవసరం లేదు.. ఇది లక్ష మందిలో ఒకరు లేదా ఇద్దరికిమాత్రమే వస్తుంది.. గుంటూరు జీజీహెచ్ లో నెలకు సరాసరిన 15 కేసులు వస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు.
రాష్ట్రంలో ఈ ఏడాది జీబీఎస్ కేసుల సగటు చూసినా సాధారణంగానే ఉందన్న వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు.. ఏవైనా వైరస్ జబ్బులు బారిన పడి కోలుకున్న వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందన్నారు. చేతులు కాళ్లు చచ్చుబడి పోయి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయని.. ఇమ్యూనో గోబ్లిడ్స్ వంటి ఖరీదైన సూది మందులు వారికి ఇవ్వాల్సి ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు వివరించారు.
రోజుకు 5 వెజీల్స్ చొప్పున రెండు లేదా మూడు రోజులు ఇంజక్సన్లు చేయాలని.. ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ సూది మందు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ సిండ్రోం విషయం పై చర్చించారని ఆయన తెలిపారు. బాధితులకు చికిత్స విషయంలో ఖర్చుకు రాజీ పడకుండా చికిత్స అందించాలని చంద్రబాబు ఆదేశించారని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు వివరించారు.