ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. వైసీపీ ఘోర పరాజైన తర్వాత ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేత్ర వరుసపెట్టి బయటికి వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నుంచి బయటకు వస్తున్న వారిలో కొందరు నేతలు టీడీపీలో చేరుతుంటే .. మరికొందరు జనసేనలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి గోదావరి జిల్లాకు చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని తాజాగా పసుపు కండువా కప్పుకున్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబు సమక్షంలో ఆళ్ల నాని టీడీపీలో చేరారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏలూరు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు.. కీలకమైన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న నాని .. ఉప ముఖ్యమంత్రిగా కూడా వ్యవహరించారు. జగన్ మూడేళ్ల తర్వాత నాని ఉప ముఖ్యమంత్రి పదవి, మంత్రి పదవి పీకేశారు. అప్పటినుంచి ఆయన అసలు బయటకు రాలేదు. మొన్న ఎన్నికల్లోనే నానికి టిక్కెట్ వస్తుందా.. రాదా.. అన్న ప్రచారం కూడా జరిగింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత నాని సైలెంట్ అయ్యారు. కొద్ది రోజుల క్రితం వైసీపీ గుడ్ బై చెప్పేసి ఇప్పుడు టీడీపీలోకి వచ్చారు.
అయితే నానిని టీడీపీలో చేర్చుకోవటాన్ని గోదావరి జిల్లాల టీడీపీ క్యాడర్ అసలు సహించలేకపోతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ నానా ఇబ్బందులకు గురి చేసినా.. నాని ఇప్పుడు పార్టీలో చేరడం ఎంతవరకు కరెక్ట్ అని నానిని పార్టీలో చేర్చుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాన్ని చంద్రబాబు దెబ్బతీశారని.. జిల్లా టీడీపీ క్యాడర్ ఆవేదనతో ఉంది. ఇలాంటి అవకాశవాద రాజకీయాలు చేసే వారిని పక్కన పెట్టాలని టీడీపీ కార్యకర్తలు కోరుతున్నారు. ఇక ఏలూరు లోకల్ ఎమ్మెల్యే చంటి కూడా అయిష్టంగానే నాని పార్టీ చేరికను ఓకే చేశారని టాక్ ?