బీసీల మీద బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే జన గణన తో పాటు కుల గణన చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సవాలు విసురుతున్నారు. 1994లో మోడీ  గాన్సి అనే కులాన్ని బీసీ లలో చేర్చారన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్.. సీఎం రేవంత్ రెడ్డి కూడా మోడీ లీగల్లి కన్వర్ట్డే బీసీ అని అన్నారన్నారు. పదేళ్లలో OBC ప్రధాని మోదీ బీసీలకు చేసింది ఏమి లేదు.. కుల గణన దేశ చరిత్రలో నిలిచిపోయే అంశం.. రేవంత్ రెడ్డి అన్న మాటలకు బీజేపీ నేతలు హైరానా పడుతున్నారు... కేంద్రమంత్రి బండి సంజయ్ ఏదేదో మాట్లాడుతున్నారు... బండి సంజయ్ పుట్టుకతో ఓబీసీ.. మోడీ పుట్టుకతో బీసీ కాదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ తెల్చి చెప్పారు.


బండి సంజయ్ కష్టపడి పని చేసినా.. ఎన్నికల నాటికి బీజేపీ తీసిపడేసిందన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్.. బీసీల మీద బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే జన గణన తో పాటు కుల గణన చేయాలని.. కుల గణన రీ సర్వే పూర్తి అయ్యాక చట్టం చేస్తామని.. 9వ షెడ్యూల్ చట్ట సవరణ చేసి దేశంలోని బీసీ లకు కేంద్రంలో ఉన్న బీజేపీ మేలు చేయాలని సవాలు విసిరారు.


సీఎం రేవంత్ రెడ్డి మోడీ కులం గురించి తప్పు మాట్లాడలేదు.. అమిత్ షా కూడా దీనిని అంగీకరించారు.. 24-7-1994 లో ఓసీ నుంచి ఓబీసీ లలో చేర్చారు... రాహుల్ గాంధీ తాత గురించి బట్టబాజి మాటలు బీజేపీ మాట్లాడుతుంది... గాంధీ కుటుంబం త్యాగాలు మర్చిపోయి బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు.. బీజేపీ నేతలు దేశం కోసం ఏం త్యాగం చేశారు...  రాహుల్ గాంధీ కులం దేశ ప్రజలకు తెలుసు. రాహుల్ గాంధీ కులం అడుగుతున్న మీరు దేశంలో కుల గణన చేసి ఆయన ఇంటికి వెళ్లి అడగండి. సోనియా గాంధీ ఇటలీ లో పుట్టిన భారతీయత ను పుణికి పంచుకుంది అని పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నారు.


ఇప్పటికే డిల్లీ స్కాం బయట పడింది. పింక్ బుక్ ఓపెన్ చేస్తే ఇంకా ఎన్ని స్కాం లు బయట పడతాయో తెలియదు. అందుకే పింక్ బుక్ ఓపెన్ చేయవద్దు అని కవిత కు సూచనలు చేస్తున్నాను. కేంద్ర మంత్రి నని మర్చిపోయి బండి సంజయ్ మాట్లాడుతున్నారు.  సెక్యులర్ దేశం అని బండి సంజయ్ గుర్తు పెట్టుకోవాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: