ఇటీవల సింగర్ మంగ్లీపై టీడీపీ సోషల్ మీడియా అటాక్ చేసింది. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మంగ్లీని తీసుకుని ఓ ఆలయంలోకి వెళ్లడంపై విమర్శలు వచ్చాయి. టీడీపీకి పాట పాడనని చెప్పిన మంగ్లీని టీడీపీ నేతలు వెంటబెట్టుకుని గుళ్లకు వెళ్లడం ఏంటని విమర్శలు వచ్చాయి. దీనిపై ప్రముఖ నేపథ్య గాయని మంగ్లి బహిరంగ లేఖ ద్వారా వివరణ ఇచ్చింది.


దేవుని కార్యక్రమానికి రాజకీయ పార్టీ ముద్రవేసి ఆరోపణలు చేయడం అన్యాయమన్న సింగర్ మంగ్లీ.. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీకి చెందిన కొందరు లీడర్లు సంప్రదిస్తే పాట పాడానన్నారు.
నేను ఇతర పార్టీలకు సంబంధించిన ఎవరిని ఒక్క మాట అనలేదు.. వైఎస్సార్సీపీ ఒక్కటే కాదు అన్ని పార్టీల లీడర్లకు పాటలు పాడానని సింగర్ మంగ్లీ తెలిపారు.


వైఎస్సార్పీపీకి పాట పాడటం వల్ల చాలా అవకాశాలు కోల్పోయానన్న సింగర్ మంగ్లీ.. వైఎస్సార్పీపీ పాట వల్ల ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానన్నారు.. నా పాట ప్రతి ఇంట్లో పండుగ పాట కావాలి కానీ పార్టీల పాట కాకూడదన్న సింగర్ మంగ్లీ.. 2024లో ఎన్నికల్లో ఏ పార్టీలకు నేను పాటలు పాడలేదన్నారు.


తాను చంద్రబాబునాయుడుకి నేను పాట పాడను అన్నది అవాస్తవమన్న సింగర్ మంగ్లీ.. రాజకీయ లబ్ది కోసం నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. దేశ రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్న వ్యక్తి చంద్రబాబు అని ప్రశంసించిన సింగర్ మంగ్లీ.. 2019 ఎన్నికల్లో వీడియో క్లిప్పులతో నాపై విషప్రచారం చేస్తున్నారని.. నాకు ఎలాంటి రాజకీయ అభిమతాలు, పక్షపాతాలు లేవు తెలిపారు. నేను ఏ పార్టీ ప్రచార కార్యకర్తను కాను.. ఒక కళాకారిణిగా నాకు నా పాటే అన్నింటికన్నా ముఖ్యం.. నా పాటకు రాజకీయ రంగు పులమొద్దని సింగర్ మంగ్లీ కోరారు. ఏ రాజకీయ పార్టీలతో నాకు సంబంధం లేదన్నారు సింగర్ మంగ్లీ. మరి ఇకనైనా మంగ్లిపై టీడీపీ సోషల్ మీడియా దాడి ఆగుతుందో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: