
కామన్ మెన్ పరిస్థితి ఇలా ఉంటే కాస్త డబ్బు ఉండి లైఫ్ ఎంజాయ్ చేయాలని అనుకునే వారికి కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్ గా మారుతుంది. ఇక్కడ ఉండే సర్కిల్ .. ఇక్కడ ఉండే నైట్ లైఫ్ .. ఇక్కడ ఉండే సరదాలు .. ఇక్కడ ఉండే ఫుడ్ జాయింట్లు .. పబ్బులు ఇలా ఒకటేమిటి అన్నిటికీ కేరాఫ్ హైదరాబాద్ గా మారుతుంది. అందుకే ఏపీ మంత్రులు సెలబ్రిటీలు ఉన్నతాధికారులు ఏ మాత్రం అవకాశం దొరికిన వెంటనే హైదరాబాదులో వాలిపోతున్నారు. అలా అని ఇక్కడ సెటిల్మెంట్లు ఏమీ జరగవు .. ఇక్కడేమీ ఫైల్ క్లియరెన్స్ ఉండదు .. సరదాగా రావటం మిత్రులతో బాతాకానీ పెట్టుకోవడం .. కాస్త అలవాటు ఉన్నవాళ్లు మందు పుచ్చుకుంటారు .. లేని వాళ్ళు మంచి ఫుడ్ లాగిస్తారు ప్రపంచం ఎలా ముందుకు ? వెళుతుంది ఎక్కడ ఏ వెంచరు ఉంది ?ఎక్కడ రేటు ఎలా ఉన్నాయి? ఎక్కడైనా లాభసాటి బేరం ఉందా ఇలాంటి కబుర్లు హైదరాబాదులో ఎక్కువగా దొరుకుతాయి.
అందుకే ఆంధ్రప్రదేశ్ మంత్రులు .. ఎమ్మెల్యేలు .. ఎంపీలు కూడా సోమవారం నుంచి శుక్రవారం వరకు తమ పనులతో బిజీగా ఉండి శని .. ఆదివారాలు హైదరాబాద్ వచ్చేస్తున్నారు. ఏపీ సెక్రటేరియట్ జనాలు కూడా ఎక్కువ మంది హైదరాబాదులో కుటుంబాలు ఉన్నవారే. వారంతా అక్కడ నుంచి వీకెండ్ లో ఇక్కడికి వస్తారు. ఇక చాలామంది మంత్రులకు కుటుంబాలు హైదరాబాదులో ఉన్నాయి.. వాళ్ల కోసమైనా హైదరాబాద్ రాక తప్పని పరిస్థితి.