
వివేక దారుణ ఘటనలో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారిని ఇప్పటికీ అరెస్టు చేయించలేకపోతున్నారు. సదరు కేసు విషయంలో ప్రభుత్వాన్ని కూడా ముందుకు నడిపించే విషయంలో విఫలమవుతున్నారు. కారణాలు ఏమైనా సునీతలో అసహనం పెరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రెండుసార్లు హోం మంత్రి అనితను కలుసుకున్న సునీత కేసు విచారణ వేగం చేయాలని అభ్యర్థించారు .. అయినా కేసు ముందుకు సాగటం లేదు. ఈ విషయంలో షర్మిల సైలెంట్ అయ్యారు. ఎనిమిది నెలలుగా వివేక పేరు కూడా ప్రస్తావించడం లేదు. జగన్ పై తరచుగా విమర్శలు చేస్తున్న షర్మిల వివేక కేసు పై నోరు ఎత్తటం లేదు. ఈ నేపథ్యంలోనే సునీత - షర్మిల మధ్య గ్యాప్ పెరుగుతున్నట్టు తెలుస్తోంది. రెండు రోజులుగా ఇద్దరి మధ్య మెసేజ్లు వార్ జరుగుతుందని కడపలో ప్రచారం జరుగుతుంది. ఇలా చేశావు ఏంటి అని షర్మిలను సునీత ప్రశ్నిస్తోందని .. ఈ విషయం షర్మిల మౌనం వహిస్తున్నారని ఇద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైందని అంటున్నారు.