![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/editorial/77/revanthf6d94149-d9dc-41bf-b480-2b3d671c0968-415x250.jpg)
ఆరు గ్యారంటీలను ప్రకటించి.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేసేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది. మహిళలకు ఉచిత బస్సు రైతు రుణమాఫీ, రైతు భరోసా , ఇందిరమ్మ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డుల జారీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తోంది. అయితే ఇంకా చాలా హామీలు మిగిలే ఉన్నాయి. అమలు చేసిన వాటికన్నా పెండింగ్‌లో ఉన్నవే ఎక్కువగా ఉన్నాయి.
దీంతో హస్తం పార్టీకి ఆశించిన మైలేజీ రావడం లేదు. రుణమాఫీ, కొత్త రేషన్‌కార్డుల జారీతో మంచి మైలేజీ వస్తుందని హస్తం నేతలు భావించారు. కానీ, ప్రచారంలో పార్టీ నేతలే వెనుకబడుతున్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్‌పై విపక్షాలు బలంగా వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయి. బీఆర్‌ఎస్, బీజేపీ అనేక వియాల్లో కాంగ్రెస్ పాలనను తప్పు పడుతున్నాయి. హామీలు అమలు చేయలేదని ఎత్తి చూపుతున్నాయి.
మరోవైపు ప్రతిపక్షాల సోషల్ ప్రచారాన్ని తిప్పి కొట్టడంలో హస్తం పార్టీ సోషల్ మీడియా విఫలమవుతోంది. మరోవైపు పథకాలను కూడా సోషల్ మీడియా వేదికగా పెద్దగా ప్రచారం చేసుకోవడం లేదు. బీఆర్‌ఎస్ కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారాన్ని విస్తృతం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో కొన్ని మంచి పనులు చేసింది.
మహిళలకు ఫ్రీ బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్, రైతు రుణమాఫీ. కానీ, వీటిని హస్తం నేతలు ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యారు. ఉచిత ప్రయాణంతో నెలకు సుమారు రూ.3 కోట్ల రూపాయలు మహిళలకు మిగులుతున్నాయి. దీనిని ప్రచారం చేసుకోవడం లేదు. రుణమాఫీతో రైతులకు లక్షల మంది రైతులకు కోట్ల రూపాయల లబ్ధి కలిగింది. కానీ దీనిని కూడా సరిగా ప్రచారం చేసుకోలేకపోయింది. రూ.500 సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కారణంగా కూడా పేద, మధ్య తరగతి ప్రజలకు భారీగా లబ్ధి కలుగుతోంది. దీనిని లెక్కలతో సహా వివరించడంలో పాలకులు విఫలమవుతున్నారు. మరి వీటన్నింటిని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ లు ఏ విధంగా అధిగమిస్తారో చూడాలి.