మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని అంటేనే ఫైర్. ఊర మాస్ లీడర్‌.  గత వైసీపీ ప్రభుత్వంలో ఆయన ఫుల్ ఫైర్ గా ఉండేవారు. చంద్రబాబు, నారా లోకేశ్, టీడీపీపై విమర్శల వర్షం కురిపంచేవారు. అయితే ఈ ఎన్నికల్లో ఆనూహ్యంగా గుడివాడ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో అప్పటి నుంచి రాజకీయాల్లో యాక్టివ్ గా కనిపించడం లేదు. పైగా కూటమి నేతలు ఆయనపై పలు కేసులు సైతం పెట్టారు. దీంతో ఇక కొడాలి నాని రాజకీయాలకు గుడ్ బై చెబుతారు అనే ప్రచారం జోరుగా సాగింది.


ఈ నేపథ్యంలో ఆయన తాజాగా మీడియా ముందుకు వచ్చారు. తనదైన శైలిలో మాస్ రిప్లైలు ఇస్తూ వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపారు.  సన్నిహిత మిత్రుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టు  నేపథ్యంలో ఆయన్ను మంగళవారం విజయవాడ సబ్ జైల్లో పరామర్శించారు.  ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ…  ఎన్నికల తర్వాత కొడాలి భయపడుతున్నారనే ప్రచారాన్ని కొట్టిపడేశారు.  నెక్ట్స్ కొడాలి అరెస్టు అంటూ అధికార పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనలకు బెదిరిపోనని చెప్పారు


మూడు కాదు ముప్ఫై కేసులు పెట్టుకోండి.. లాయర్లు ఉన్నారు వారే చూసుకుంటారంటూ ధీమా వ్యక్తం చేశారు.  చాలాకాలం తర్వాత కొడాలి చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడయాలో వైరల్ అవుతున్నాయి. ఓ మహిళా మీడియా ప్రతినిధిని ఇదే విషయమై కొడాలని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓడిన తర్వాత కనిపించడం మానేశారంటూ అడిగే సరికి కొడాలి తన సహజ ధోరణిలో సమాధానమిచ్చారు.   మీ ఉద్యోగం లేకపోతే ఇలా మైకులు పట్టుకుని తిరుగుతారా? అంటూ ఎదురుప్రశ్న వేశారు.  అంతేకాకుండా చంద్రబాబు, ఏబీఎన్ రాధాక్రిష్ణ, టీవీ 5 నాయడులకు రోజూ వచ్చి కనిపించాలా? అంటూ నిలదీశారు.


మంత్రి లోకేశ్ రెడ్ బుక్ పైనా కొడాలి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్కులు, బ్లూ బుక్కులు నన్నేమీ చేయలేవన్నారు.  మీపై మూడు కేసులు నమోదయ్యాయి కదా? అంటే మూడు కాదు ముప్ఫై కేసులైనా పెట్టుకోమని సవాల్ విసిరారు. ఇక వల్లభనేని వంశీ అరెస్టు చిన్న విషయంగా ఆయన తేల్చిచెప్పారు. ఎవరిని అరెస్టు చేసినా ఫర్వాలేదని తాము మళ్లీ అధికారంలోకి వచ్చాక అట్టుకు అట్టున్నర, రెండు, మూడు తిరిగి చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: