ఏపీలో రాజకీయాలు ఇప్పుడిప్పుడే వేడెక్కుతున్నాయి. మాజీ సీఎం జగన్  ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు.  అయితే సీఎం చంద్రబాబును పదే పదే టార్గెట్ చేస్తున్న జగన్.. పవన్ పైన మాత్రం మౌనం పాటిస్తున్నారు.  ప్రభుత్వ వైఫల్యాల్లో పవన్ ను విస్మరిస్తున్నారు.  ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తున్నారు.  ఎన్నికల్లో ఓడిన తరువాత తొలిసారిగా రైతుల సమస్యల పైన ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.


ఎనిమిది నెలల కాలంలో పలు సందర్భాల్లో కూటమి ప్రభుత్వం పైన జగన్ విమర్శలు చేసారు.  చంద్రబాబు లక్ష్యంగానే జగన్ ఆరోపణలు కొనసాగుతున్నాయి. పవన్ పైన మాత్రం ఎలాంటి ఆరోపణలు చేయ టం లేదు.  వైసీపీ నేతలు.. ఆ పార్టీ మద్దతుగా సోషల్ మీడియా మాత్రం పవన్ లక్ష్యంగా ఆరోపణలు కొనసాగిస్తోంది.  జగన్ మాత్రం ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే క్రమంలో అసలు పవన్ ప్రస్తావన చేయటం లేదు. చంద్రబాబు పైన మాత్రమే గురి పెడుతున్నారు.



ఎన్నికల ప్రచారం వరకు చంద్రబాబు తో పాటుగా పవన్ ను ఉద్దేశించి జగన్ పలు ఆరోపణలు చేశారు. పవన్ వివాహాల గురించి పదే పదే విమర్శలు చేశారు. ఇప్పుడు ఇంత సడన్ గా పవన్ గురించి ఎలాంటి ఆరోపణలు చేయకపోవటం చర్చనీయాంశంగా మారింది.  చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేస్తూ.. పవన్ ను విస్మరించటం వ్యూహాత్మకమా.. లేక చంద్రబాబును మాత్రమే జగన్ తన రాజకీయ ప్రత్యర్ధిగా భావిస్తున్నారా అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైంది.  


పవన్ ను టార్గెట్ చేసిన కారణంగానే  గత ఎన్నికల్లో పార్టీకి బాగానే డ్యామేజ్ అయిందనే టాక్ పార్టీ వర్గాల్లో బాగానే నడిచింది.  దీంతో జగన్ ఇప్పుడు వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది.  చంద్రబాబు పైన గురి పెట్టటం ద్వారా మొత్తంగా ప్రభుత్వం పైనే టార్గెట్ చేసినట్లవుతుందనే వాదన వినిపిస్తోంది.  జగన్ వరుసగా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నా.. పవన్ సైతం మౌనంగానే ఉంటున్నారు. దీంతో, పొలిటికల్ వార్ మరోసారి టీడీపీ వర్సస్ జగన్ గా మారుతోంది. కూటమిలో పరిణామాలతోనే జగన్ తన రూటు మార్చినట్లు వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: