
ఏపీలో మొత్తం 13 పాత జిల్లా కేంద్రాల్లోని 175 పరీక్షా కేంద్రాల్లో ఈపరీక్షలను నిర్వహించడం జరుగుతుంది. పరీక్షల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే మార్గదర్శకాలను జిల్లాలకు పంపండం జరిగింది. ఈపరీక్షలకు 92వేల 250 మంది అభ్యర్ధులు హాజరు కానున్నారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు వీలుగా పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని కలక్టర్లు, ఎస్పిలను ఆదేశించారు.
పరీక్షలు సజావుగా సక్రమంగా జరిగేందుకు వీలుగా ఇప్పటికే అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. సెన్సిటివ్ పరీక్షా కేంద్రాలుగా గుర్తించిన ప్రాంతాల్లో మరిన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సిఎస్ విజయానంద్ కలక్టర్లు, ఎస్పిలు, ఎపిపిఎస్సి అధికారులను ఆదేశించారు. గ్రూపు 2 మెయిన్ పరీక్షల ఏర్పాట్ల గురించి పాత 13 జిల్లా కేంద్రాల్లోని 175 పరీక్షా కేంద్రాల్లో ఈపరీక్షలను నిర్వహించడం జరుగుతుంది.
23వ తేదీ ఉదయం 10గల.ల నుండి మధ్యాహ్నం 12.30 గం.ల వరకూ పేపర్-1 వ్రాత పరీక్ష ఉంటుంది. అభ్యర్ధులు ఉ.9.30 గం.ల లోపు ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఉ.9.45 గం.లకు పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేస్తారు. ఆలస్యంగా వచ్చిన ఎవరినీ లోనికి అనుమతించరు. అదే విధంగా మధ్యాహ్నం 3గం.ల నుండి 5.30 గం.ల వరకూ పేపర్-2 పరీక్ష ఉంటుంది. అభ్యర్ధులు మధ్యాహ్నం 2.30 గం.ల లోగా ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. 2.45 గం.లకు ఆపరీక్షా కేంద్రాలా గేట్లను మూసివేసి ఆతర్వాత ఎట్టిపరిస్థితుల్లోను అభ్యర్ధులెవరినీ లోనికి అనుమతించరు.