ప్రతిపక్ష నేతలు సెక్యూరిటీ తగ్గించడమేంటని ఇటీవల జగన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఒక సంఘ విద్రోహ శక్తిని పరామర్శించడానికి జైలుకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్ కి సిగ్గు ఉండాలని పొలిట్ బ్యూరో సభ్యులు జాతీయ ప్రధాన కార్యదర్శి  వర్ల రామయ్య ఎద్దేవా చేసారు. ఏమి ఘనకార్యం చేశారని పరామర్శించడానికి వచ్చారని వర్ల రామయ్య ప్రశ్నించారు.


ఇటువంటి వారికి సెక్యూరిటీ కూడా ఇవ్వాలా.. మాజీ ముఖ్యమంత్రి కి జెడ్ క్యాటగిరి సెక్యూరిటీ ఎక్కడా ఇవ్వరని వర్ల రామయ్య అన్నారు.  రైతులకు ఏమి చేశారని రైతులను పరామర్శించడానికి మిర్చి యార్డుకు వెళ్లారు.. మిర్చి యార్డ్ బోర్డు పరిపాలన అంతా వైసిపి చేతుల్లోనే ఉన్నది ..రైతులను పరామర్శించడానికి వచ్చారా.. రైతుల దగ్గర ఉన్నాం మిరపకాయల టిక్కీలు కొట్టేయడానికి వెళ్లారా..  అంటూ వర్ల విరుచుకుపడ్డారు.


పదవి పోయినా మీ బుద్ధి మాత్రం పోలేదు.. కుక్క తోక వంకర లాగా మిమ్మల్ని పదవుల నుంచి పీకేసినా జనాలు చీకొట్టినా సరే.. మీ దొంగబుద్ధులు పోనిచ్చుకోలేదని వర్ల రామయ్య హేళన చేశారు.  అదే విధంగా పోలీసులును హెచ్చరించిన్నట్టు వ్యక్తిగతంగా దూషించటం చాలా అహంకారపూరితమైన భాషతో మాట్లాడటం తగదు అని వర్ల రామయ్య హెచ్చరించారు.


జగన్‌ మిర్చి యార్డు వద్దకు వెళ్లడమే అక్రమమని అధికారులు చెబుతుంటే.. అక్కడ తనకు సెక్యూరిటీ కల్పించలేదని వాదించడం విడ్డూరంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. కలెక్టర్, కోర్టులు కూడా వద్దని చెప్పినా జగన్ రెడ్డి పెడచెవిన పెట్టాడని మంత్రి కొల్లు రవీంద్ర  ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య భయాందోళనలు సృష్టించి ఎన్నికల సమయంలో రాద్దాంతం చేయాలనే కుట్రతోనే జగన్‌ మిర్చి యార్డుకు వెళ్లారని మంత్రి కొల్లు రవీంద్ర  ఆరోపించారు.  దళితుడిని కిడ్నాప్ చేసిన కేసులో అరెస్టైన వ్యక్తిని జైలుకు వెళ్లి మరీ పరామర్శించడానికి జగన్ రెడ్డి సిగ్గుపడాలని మంత్రి మండిపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: