కృష్ణా జలాలు, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మంత్రి reddy NALAMADA' target='_blank' title='ఉత్తమ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యత లేకుండా ఉత్తర కుమారుని తరహాలో చెత్త మాటలు మాట్లాడారని మాజీమంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. కృష్ణా జలాల విషయంలో హరీశ్ రావు బీఆర్ఎస్ తరపున ప్రభుత్వానికి సూచనలు చేశారని.. వాటిపై మంత్రి స్పందించకుండా అనవసర విషయాలన్నీ మాట్లాడారని మండిపడ్డారు. తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్, బీజెపీ పార్టీలు, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మాత్రమే... నలుగురు ప్రధాన ద్రోహులు అని ఆయన ఆరోపించారు.

తెలంగాణకు కాంగ్రెస్ చేసిన అన్యాయంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చకు సిద్ధమని జగదీష్ రెడ్డి అన్నారు. కృష్ణా బోర్డు కేంద్రం చేతిలో కాకుండా.. చంద్రబాబు చేతిలో ఉందని వ్యాఖ్యానించారు. అబద్ధాలు మాట్లాడితే ముఖ్యమంత్రి కావచ్చు అన్న ఆలోచనతో reddy NALAMADA' target='_blank' title='ఉత్తమ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో ప్రజలకు వాస్తవాలు తెలుసన్న జగదీష్ రెడ్డి.. కేసీఆర్ హయాంలో వలస పోయిన వారు వెనక్కు వచ్చారు, ఇతర రాష్ట్రాల వారు కూలీ పనుల కోసం ఇక్కడకు వచ్చారని గుర్తు చేశారు.

ఏపీలో వీరి లాగా ఇతర పార్టీలు కట్టిన ప్రాజెక్టులను ఏనాడూ వ్యతిరేకించలేదన్న జగదీష్ రెడ్డి... పోలవరం, పులిచింతలకు వ్యతిరేకంగా నాడు మంత్రి పదవులకు రాజీనామా చేసిన చరిత్ర కేసీఆర్, నాటి టీఆర్ఎస్ పార్టీదని జగదీష్ రెడ్డి అన్నారు. కేంద్రం పై మాట్లాడకుండా కేసీఆర్ ను తిడుతున్నారని.. బీజెపీ, చంద్రబాబును విమర్శించడానికి భయపడుతున్నారని జగదీష్ రెడ్డి ఆక్షేపించారు.

కాంగ్రెస్ నేతలు అవినీతి గురించి మాట్లాడితే ఆ పదమే సిగ్గు పడుతుందన్న మాజీమంత్రి జగదీష్ రెడ్డి.. కమిషన్ల గురించి కింది స్థాయి ప్రజా ప్రతినిధులు, గుత్తేదార్లు ఏమంటున్నారో అందరికీ తెలుసని పేర్కొన్నారు.  కాంగ్రెస్ కార్యకర్తలే వారి గురించి బహిరంగంగా మాట్లాడుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి ఇస్తున్న మూటలు, మంత్రుల సంపాదనకు సంబంధించి తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్న జగదీష్ రెడ్డి.. సమయం వచ్చినప్పుడు బయట పెడతామని తెలిపారు.





మరింత సమాచారం తెలుసుకోండి: