రేవంత్ రెడ్డి పద్నాలుగు నెలలపై చర్చకు సిద్ధం.. సీఎం సవాలును స్వీకరిస్తున్నానని మాజీ మంత్రి హరీశ్ రావు  తెలిపారు. రేవంత్ రెడ్డి చెప్పిన చోటుకు, చెప్పిన సమయానికి వస్తాను .. కొడంగల్ నియోజకవర్గం అయినా, రేవంత్ రెడ్డి ఇంట్లో అయినా చర్చకు తప్పకుండా వస్తాను.. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో పాటు అన్ని అంశాలపైనా చర్చ చేద్దాం.. దవడలు పగల గొట్టాల్సివస్తే అన్నింటా దగా చేసి ఏపీ కృష్ణా జలాల దోపిడీని నిలువరించలేకపోతున్న రేవంత్ రెడ్డి దవడనే పగలగొట్టాలని మాజీ మంత్రి హరీశ్ రావు  అన్నారు.

 
రేవంత్ రెడ్డి అరుపులు, పెడబొబ్బలతో రాష్ట్ర సాగు, తాగు నీళ్ల కష్టాలు తీర్చలేరు.. నిందలు వేయడం మాని నదీజలాల్లో తెలంగాణ ప్రయోజనాలు కాపాడండి.. అబద్దాల కోసం కాకుండా పది మందికి ఉపయోగపడేలా పాలన అందించడానికి ప్రయత్నించండి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు అలవాటైన పైశాచిక భాషలో పాలమూరు ప్రగతిపై పచ్చి అబద్ధాలు మాట్లాడారు.. కృష్ణా జలాలను ఏపీ యదేచ్చగా తరలించుకపోతుంటే ఆపడం చేతగాక... మా మీద మాట్లాడుతున్నారు అని మాజీ మంత్రి హరీశ్ రావు  అన్నారు.


పాలమూరును ఎడారిగా మార్చిన తెలుగుదేశం, కాంగ్రెస్ లతో అంటకాగి తీరని ద్రోహం చేసింది రేవంత్ రెడ్డి.. దత్తత తీసుకున్న చంద్రబాబుకు పాదసేవ చేస్తూ పాలమూరు ప్రయోజనాలను కాలరాచిన పాపమే జిల్లాకు శాపమైంది.. ఆనాడు తెలంగాణలో ఓట్లడిగే మొఖం చెల్లక మా పొత్తు కోసం తెలుగుదేశం పార్టీ జోలె పట్టింది..  పాలమూరు ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చి... ప్రజల బతుకుల్లో నిప్పులు పోసింది కాంగ్రెస్.. పాలమూరు ను ఎండబెట్టిన కాంగ్రెస్, టీడీపీ పాపంలో రేవంత్ రెడ్డికి వాటా ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు  తెలిపారు.


పోతిరెడ్డిపాడు విస్తరిస్తామన్నందుకే దరిద్రపు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మేం బయటకు వచ్చాం.. నదీ జలాల్లో కాంగ్రెస్ చేస్తున్న ద్రోహానికి వ్యతిరేకంగానే ఆనాడు 40 రోజులు పాటు అసెంబ్లీని స్తంభింపజేశాం..
పోతిరెడ్డిపాడు నీళ్లు తరలిస్తుంటే హారతులు ఇచ్చింది, వైఎస్ కు ఊడిగం చేసింది కాంగ్రెస్ నేతలనే చరిత్ర మరచి రేవంత్ మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: