- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .


ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లపాటు వైసీపీ ప్రభుత్వ విధానాలపై ఎన్నో పోరాటాలు చేశారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు.. జనసేన, తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఎంతో కష్టపడి వైసిపి ప్రజా వ్యతిరేక విధానాలను తట్టుకుని మరీ పార్టీను నిలబెట్టారు. చివరకు ఎన్నికలకు ముందు తెలుగుదేశం, జనసేన, బిజెపి మూడు పార్టీలు కలిసి కూటమిగా పోటీచేసి.. వైసిపిని గద్దె దించి అధికారంలోకి వచ్చాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయి.. దాదాపు తొమ్మిది నెలలు కావస్తోంది. ఇప్పటికి చాలా పదవులు భర్తీకాని పరిస్థితి.


జగన్ ముఖ్యమంత్రి అయిన రెండు నెలలకే మార్కెట్ కమిటీ చైర్మన్‌తో పాటు. సొసైటీ చైర్మన్ వ‌ర‌కు అన్ని కీలక నామినేటెడ్ పదవులను చాలా త్వరగా భర్తీ చేసి.. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్లో మంచి జోష్ నింపారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అది కనిపించడం లేదు. టీటీడీ చైర్మన్ పదవి భర్తీ చేసేందుకు చంద్రబాబుకు ఏకంగా ఆరు నెలలకు పైగానే పట్టింది. ఇక మార్కెట్ కమిటీలు , సొసైటీ చైర్మన్ పదవులు .. ఇంకా భర్తీ కాలేదు. చంద్రబాబు తీరుతో తెలుగుదేశం పార్టీ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు రగిలిపోతున్నారు.


చంద్రబాబు ఎప్పటికీ మారడు.. తాను అధికారంలోకి వస్తే చాలు పార్టీ కార్యకర్తలకు కూడా పట్టించుకోరు .. అని తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అటు పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు నాలుగేళ్ల పాటు క్షేత్రస్థాయిలో వైసీపీ ని ఎదుర్కొని ఎన్నో పోరాటాలు చేసిన జనసేన కార్యకర్తలకు కూడా ఎలాంటి పదవులు లేక .. ఎలాంటి పనులు లేక .. ఎలాంటి ప్రయోజనం లేక.. తీవ్ర అసహంతో రగిలిపోతున్నారు. ఏది ఏమైనా 9 నెలలకే కూటమి ప్రభుత్వం వచ్చిన ఆ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు నాయకులకు ఎలాంటి ఆనందం లేకుండా పోయింది అన్నది నూటికి నూరు శాతం నిజం.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp