
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్షి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన రేవంత్ ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ ని ప్రకటించారు. ఇక నుంచి ఏడాదికి రెండు ఖరీదైన చీరలు ఇస్తామని సంచలన ప్రకటన చేశారు. తాజాగా సీఎం నారాయణ పేటలో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడారు.
మహిళలను అన్ని రంగాల్లో దూసుకుపోయే విధంగా చేస్తామన్నారు. అంతే కాకుండా తమ ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే టార్గెట్ గా పెట్టుకుందన్నారు. అక్కడ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నడిచే పెట్రోల్ బంక్‌ను ఆయన ప్రారంభించారు. దేశంలోనే తొలిసారి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్‌ను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం మొదటి ప్రయారిటీ మహిళలే అని స్పష్టం చేశారు. వారు ఆత్మగౌరవంతో ఉండాలని కోరుకున్నారు.
గత ప్రభుత్వం మహిళా సంఘాలను పట్టించుకోలేదని ఇందిరమ్మ ప్రభుత్వం మాత్రం మహిళా సంఘాలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుందన్నారు. ఈ సందర్భంగానే మహిళలు ఆత్మగౌరవంతో ఉండాలని ఏడాదికి రెండు కాస్ట్లీ ఇస్తున్నామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. గతంలో బతుకమ్మ సమయంలో మామూలు చీరలు ఇచ్చేవారని ఆయన గుర్తు చేశారు. కానీ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఖరీదైన చీరలు ఇస్తామని స్పష్టం చేశారు. అంబానీ, అదానీలు పోటీపడే సోలార్ ప్రాజెక్టుల్లో మహిళలను ప్రోత్సహిస్తామంటూ చెప్పుకొచ్చారు. మహిళలు వ్యాపారంలో దూసుకుపోయేలా వారిని ప్రోత్సహిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.
తెలంగాణలో కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడానికి టార్గెట్ పెట్టుకుందన్నారు. ఈ క్రమంలోనే 600 ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను చేశామన్నారు. 1000 వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. మహిళా స్వయం సహాయక ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు శిల్పారామం వద్ద స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే సొంత ఆడబిడ్డలకు అందించినట్లు మంచి నాణ్యమైన చీరలను మహిళలకు అందించనున్నామని తెలిపారు. రూరల్, అర్బన్ అన్న తేడా లేకుండా తెలంగాణలోని మహిళలంతా ఒక్కటేనని..అవసరం అయితే కేంద్రంతో కొట్లాడి నిధులు తెచ్చుకుంటామన్నారు.